పతంజలి కరోనా మెడిసిన్… సంచలన విషయం వెలుగులోకి

  • Published By: venkaiahnaidu ,Published On : June 24, 2020 / 12:56 PM IST
పతంజలి కరోనా మెడిసిన్… సంచలన విషయం వెలుగులోకి

కరోనా వైరస్(CoronaVirus)మహమ్మారిని అరికట్టేందుకు తాము మందు తయారు చేశామని, కరోనిల్(Coronil)పేరుతో  కరోనాకు మెడిసిన్‌ ను మార్కెట్లోకి తెస్తున్నట్లు హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగా గురువు రాందేవ్ బాబా(Ramdev Baba) ప్రకటించిన విషయం తెలిసిందే. 

కరోనిల్ వాడిన వారిలో 69శాతం మంది కేవలం మూడు రోజుల్లోనే కరోనా నెగటివ్ వచ్చిందని, మిగతావారికి వారం రోజుల్లో నెగటివ్‌గా తేలిందన్నారు. మొత్తానికి 100శాతం రికవరీ అయ్యారని, క్లినికల్ ట్రయల్స్‌లో ప్రూవ్ అయిన మెడిసిన్ జూన్ 29 నుంచి ఆర్డర్ మి (OrderMe) యాప్‌లో అందుబాటులో ఉంటుందన్నారు.

పతంజలి స్టోర్స్‌లోనూ త్వరలో కరోనిల్(Coronil) విక్రయాలు ప్రారంభిస్తామని రాందేవ్ బాబా తెలిపారు. పతంజలి కరోనా మెడిసిన్ కరోనిల్‌ లో రెండు ట్యాబ్లెట్లు, ఓ టానిక్ (లిక్విడ్) ఉంటుంది. దీన్నే కరోనిల్ కిట్ అంటారు. కరోనిల్ కిట్‌లో కరోనిల్, శ్వాసరి (Shwasari), అను టెల్(Anu Tel) అని మూడు రకాల మెడిసిన్ ఉంటుంది. కరోనిల్ కిట్(Coronil Kit Price) ధర రూ.545గా నిర్ణయించారు.

 కోవిడ్19 పేషెంట్లు 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు సగం మెడిసిన్ వాడాలని, 15 నుంచి 18 ఏళ్ల వారికైతే పూర్తి స్థాయిలో కరోనిల్ కిట్ వాడవచ్చునని తెలిపారు. కరోనిల్‌తో పాటు తీసుకునే ‘శ్వాసరి’(Shwasari) శ్వాస వ్యవస్థను మెరుగు పరుస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సమస్యలను పరిస్కరిస్తుంది. ‘అను టెల్’(Anu Tel) రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుందని పతంజలి సంస్థ చెబుతోంది. 

మరోవైపు, పంజతలి తీసుకొస్తున్న కరోనిల్‌పై ఇప్పుడే ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదని, విక్రయాలు ప్రారంభించవద్దని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. కరోనిల్ తయరీ విధానంతో పాటు శాస్త్రీయంగా ఎక్కడ, ఎలా ప్రయోగించారో పూర్తి వివరాలు తమకు తెలపాలని పతంజలి సంస్థకు సూచించింది. 

అంతేకాకుండా, హరిద్వార్ ‌లోని పతంజలి ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన మెడిసిన్స్  లైసెన్స్ కాపీలు, ప్రొడక్ట్ అప్రూవల్ వివరాలను అందించాలని కేంద్ర  ప్రభుత్వం ఉత్తరాఖండ్ ప్రభుత్వ లైసెన్సింగ్ అథారిటీని  కోరింది.

ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ ఈ ఉదయం మాట్లాడుతూ…  రామ్‌దేవ్ దేశానికి కొత్త మెడిసిన్  ఇవ్వడం చాలా మంచి విషయమని, అయితే దీనికి ఆయుష్ మంత్రిత్వ శాఖ నుండి సరైన అనుమతి అవసరమని అన్నారు. పతంజలి నిన్న మాత్రమే మందులకు సంబంధించిన పత్రాలను మంత్రిత్వ శాఖకు పంపినట్లు ఆయన ధృవీకరించారు.

కాగా, పతంజలి తన ‘కరోనిల్ మెడిసిన్’  అనుమతికోసం దరఖాస్తును సమర్పించినప్పుడు “కరోనావైరస్” గురించి ప్రస్తావించలేదని  ఉత్తరాఖండ్ ఆయుర్వేద శాఖ లైసెన్స్ ఆఫీసర్ వై ఎస్ రావత్ బుధవారం స్పష్టం చేశారు. “రోగనిరోధక శక్తిని పెంచే మరియు దగ్గు మరియు జ్వరం నివారణ” కోసం పతంజలి లైసెన్స్ కోరిందని లైసెన్సింగ్ అధికారి తెలిపారు. దగ్గు, జ్వరం నివారణ మందుగానే తాము లైసెన్స్‌ ఆమోదించామని తెలిపారు. కోవిడ్-19 కిట్ తయారు చేయడానికి వారికి అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ, ఆ సంస్థకు నోటీసులు పంపించనున్నామని చెప్పారు.