Pathaan: కూతురితో కలిసి చూడాలంటూ షారూఖ్‭‭కు సవాల్ విసిరిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్

ఈ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించకపోతే మధ్యప్రదేశ్‭లో సినిమా విడుదల కాకపోవచ్చంటూ మిశ్రా తీవ్రంగా స్పందించారు. ఈ జాబితాలో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ కూడా చేరారు. సినిమాలో అశ్లీలత ఉందంటూ స్పందించిన ఆయన, షారూక్ ఖాన్ ఆ సినిమాను తన కుమార్తెతో కలిసి చూడాలంటూ ఆయన సవాల్ విసిరారు. అంతే కాకుడా ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి, ‘పఠాన్’ సినిమాను తాను తన కుమార్తెతో కలిసి చూసినట్టు ఈ ప్రపంచానికి చెప్పాలని అన్నారు

Pathaan: కూతురితో కలిసి చూడాలంటూ షారూఖ్‭‭కు సవాల్ విసిరిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్

Pathaan row, MP speaker 'advises' Shah Rukh to watch movie with daughter

Pathaan: Pathaan: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించిన ‘పఠాన్’ సినిమా ‘బేషరం రంగ్’ పాట విడుదలైనప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ పాటలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ ఇప్పటికే కొన్ని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పలువురు రాజకీయ నాయకులు సైతం ఈ సినిమాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కొద్ది రోజుల క్రితం ఈ సినిమాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించకపోతే మధ్యప్రదేశ్‭లో సినిమా విడుదల కాకపోవచ్చంటూ మిశ్రా తీవ్రంగా స్పందించారు.

Messi Income: లెజెండ్ ఫుట్‭బాలర్ లియోనెల్ మెస్సీ సంపాదన.. ఈ భూమ్మీద మరే ఆటగాడికీ లేదట!

ఇక, ఈ జాబితాలో ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ కూడా చేరారు. సినిమాలో అశ్లీలత ఉందంటూ స్పందించిన ఆయన, షారూక్ ఖాన్ ఆ సినిమాను తన కుమార్తెతో కలిసి చూడాలంటూ ఆయన సవాల్ విసిరారు. అంతే కాకుడా ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి, ‘పఠాన్’ సినిమాను తాను తన కుమార్తెతో కలిసి చూసినట్టు ఈ ప్రపంచానికి చెప్పాలని అన్నారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదన్న స్పీకర్.. మీకేమనిపిస్తే అది చేసేస్తారా? అంటూ ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఇలాంటి సినిమాను మహమ్మద్ ప్రవక్తపై తీసి విడుదల చేస్తే ప్రపంచవ్యాప్తంగా రక్తపాతం జరుగుతుందని స్పీకర్ గిరీశ్ పేర్కొన్నారు.

Rajasthan: గుజరాత్ ఎన్నికల హామీ ఎఫెక్ట్? గ్యాస్ సిలిండర్ ధరను సగానికి తగ్గించిన రాజస్తాన్ ప్రభుత్వం

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ వచ్చే జనవరి 25న విడుదల కానుంది. అనేక విమర్శల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.