Ambulance Patient Died : డీజిల్‌ అయిపోవడంతో ఆగిన అంబులెన్స్‌.. రోగి మృతి

రాజస్థాన్‌లో విషాదం నెలకొంది. డీజిల్‌ అయిపోవడంతో అంబులెన్స్‌ ఆగిపోయింది. దీంతో సకాలంలో చికిత్స అందక ఓ రోగి మృతి చెందారు. ఈ సంఘటన బాన్సువాడా జిల్లాలో చోటు చేసుకుంది.

Ambulance Patient Died : డీజిల్‌ అయిపోవడంతో ఆగిన అంబులెన్స్‌.. రోగి మృతి

ambulance patient died

Ambulance Patient Died : రాజస్థాన్‌లో విషాదం నెలకొంది. డీజిల్‌ అయిపోవడంతో అంబులెన్స్‌ ఆగిపోయింది. దీంతో సకాలంలో చికిత్స అందక ఓ రోగి మృతి చెందారు. ఈ సంఘటన బాన్సువాడా జిల్లాలో చోటు చేసుకుంది. 40 ఏళ్ల తేజ అనే వ్యక్తి దానాపూర్ గ్రామంలో ఉంటున్న కుమార్తె, అల్లుడు ఇంటికి వచ్చాడు. తేజ 3 నెలలుగా అక్కడే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తేజ గురువారం పొలంలో అపస్మారక స్థితిలో పడిపోయారు. ఆందోళన చెందిన కుమార్తె, అల్లుడు వెంటనే ప్రభుత్వ అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు.

అంబులెన్స్‌ రావడంతో అతన్ని బాన్సువాడా జిల్లా ఆసుపత్రికి అందులో తీసుకెళ్తున్నారు. అయితే బాన్సువాడకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని రత్లాం రోడ్‌ టోల్‌ ప్లాజా సమీపంలో ఆ అంబులెన్స్‌ ఆగిపోయింది. ఏం అయ్యిందని రోగి బంధువులు డ్రైవర్‌ను అడగ్గా అంబులెన్స్‌లో డీజిల్‌ అయిపోయిందని చెప్పారు. చేసేదేమీ లేక రోగి కుమార్తె, అల్లుడు కలిసి ఆ అంబులెన్స్‌ను సుమారు కిలోమీటరు దూరం వరకు తోశారు. ఇంతలో ఆ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి రూ.500 విలువైన డీజిల్‌ కొని అంబులెన్స్‌ వద్దకు చేరుకున్నారు.

Five Died In Road Accident : అంబులెన్స్‌ను ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి

అంబులెన్స్‌లో డీజిల్‌ పోసినప్పటికీ అది ముందుకు కదలలేదు. దీందో మరో అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేశారు. అది వచ్చి ఆ రోగిని అందులో తీసుకెళ్లే సరికి గంటకుపైగా సమయం గడిచింది. ప్రభుత్వ ఆస్పత్రికి చేరిన రోగిని పరిశీలించిన వైద్యులు అతడు చనిపోయినట్లుగా నిర్ధారించారు. దీంతో రాజస్థాన్‌లో వైద్య సౌకర్యాల దుస్థితిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.