SpiceJet Flight: విమానం రెక్కలకు మంటలు.. 185 ప్రయాణికుల ఎమర్జెన్సీ ల్యాండింగ్ | Patna-Delhi SpiceJet flight wings fired plane makes emergency landing

SpiceJet Flight: విమానం రెక్కలకు మంటలు.. 185 ప్రయాణికుల ఎమర్జెన్సీ ల్యాండింగ్

గాల్లో ప్రయాణిస్తున్న విమానం రెక్కకు మంటలు అంటుకోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 185మంది ప్రయాణికులున్న విమానాన్ని బిహ్తా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ జరిపినట్లు సైస్‌జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ వెల్లడించింది.

SpiceJet Flight: విమానం రెక్కలకు మంటలు.. 185 ప్రయాణికుల ఎమర్జెన్సీ ల్యాండింగ్

SpiceJet Flight: గాల్లో ప్రయాణిస్తున్న విమానం రెక్కకు మంటలు అంటుకోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 185మంది ప్రయాణికులున్న విమానాన్ని బిహ్తా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ జరిపినట్లు సైస్‌జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ వెల్లడించింది.

“ఎయిర్‌క్రాఫ్ట్ గాల్లో ప్రయాణిస్తున్నప్పుడే మంటలు అంటుకున్నట్లు తెలిసి.. వెంటనే ల్యాండ్ చేశాం. రెండు బ్లేడ్లు వంగిపోయాయి. పుల్వారీ షరీఫ్ మంటలను గమనించి ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు” అని పట్నా జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ అన్నారు.

అగ్ని ప్రమాదం వెనుక కారణం సాంకేతిక లోపమని భావిస్తున్న ఇంజినీరింగ్ బృందం.. పూర్తి వివరాల కోసం దర్యాప్తు జరుపుతున్నారు. పాట్నా నుంచి 12.30కి ఫ్లైట్ టేకాఫ్ అయినప్పటి నుంచి విమానంలో ఏదో ఆగిపోయినట్లు అనిపించిందని ప్రయాణికుల్లో ఒకరు తెలిపారు. టేకాఫ్ అయినప్పటి నుంచి ఏదో తప్పు జరిగినట్లుగా భావించినట్లు వెల్లడించారు.

Read Also: డ్రోన్ డెలివరీ సర్వీస్‌లను ప్రారంభించనున్న స్పైస్ జెట్

ఎగిరేందుకు తీవ్రంగా సతమతమైన విమానం దాదాపు 25నిమిషాల పాటు గాల్లోనే ఉంది. ల్యాండింగ్ కాగానే, పోలీసులు, విమానాశ్రయ సిబ్బంది విమానం సమీపంలోకి చేరుకుని ప్రయాణికులందరినీ క్షేమంగా దించారు.

×