Death certificate issues : కూర్చుని అన్నం తింటున్న వ్యక్తి చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ తో పాటు డెడ్ బాడీ ఇచ్చిన డాక్టర్లు

కూర్చుని నిక్షేపంలా కూర్చుని అన్నం తింటున్న వ్యక్తి చచ్చిపోయాడని నిర్థారించారు డాక్టర్లు. పైగా అతను చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ తో పాటు డెడ్ బాడీని కూడా బంధువులకు అప్పగించారు. బీహార్ లో డాక్టర్ల చేసిన ఘనకార్యంతో సదరు వ్యక్తి బంధువులు అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. తమ కుటుంబ సభ్యుడు బ్రతికి ఉండగా వేరే వ్యక్తి మృతదేహాన్ని ఇవ్వటమే కాకుండా డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిన డాక్టర్ల నిర్వాకం బైటపడింది.

Death certificate issues : కూర్చుని అన్నం తింటున్న వ్యక్తి చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ తో పాటు డెడ్ బాడీ ఇచ్చిన డాక్టర్లు

Covid 19 Patient (1)

Patna hospital issues death certificate to alive Covid-19 patient : కూర్చుని నిక్షేపంలా కూర్చుని అన్నం తింటున్న వ్యక్తి చచ్చిపోయాడని నిర్థారించారు డాక్టర్లు. పైగా అతను చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ తో పాటు డెడ్ బాడీని కూడా బంధువులకు అప్పగించారు. అదేంటీ బతికుంటనే కదా అన్నం తినేది..అటువంటి వ్యక్తిని ఎదురుగా పెట్టుకుని చనిపోయాడని ఎలా చెబుతారు? అని షాక్ అవ్వొచ్చు. కానీ బీహార్ లో డాక్టర్ల చేసిన ఘనకార్యంతో సదరు వ్యక్తి బంధువులు అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. తమ కుటుంబ సభ్యుడు బ్రతికి ఉండగా వేరే వ్యక్తి మృతదేహాన్ని ఇవ్వటమే కాకుండా డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిన డాక్టర్ల నిర్వాకం బైటపడింది.

బీహార్ లోని బాఢ్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల చున్ను కుమార్ అనే వ్యక్తికి కరోనా సోకింది. దీంతో అతన్ని బంధువులు పీఎంసీహెచ్‌ ( పాట్నా మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ )లో చేర్పించారు. అతనికి చికిత్స కొనసాగుతోంది. ఈక్రమంలో ఓరోజు ఆసుపత్రి సిబ్బంది చుత్రూ కుమార్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి..చున్ను కుమార్ చనిపోయాడని..మృతదేహాన్ని బాంసీ ఘాట్‌కు తరలించామని తెలిపారు. దీంతో చున్ను కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ హుటాహుటిన బాంసీ ఘాట్‌కు చేరుకున్నారు. అనంతరం చేసేదేమీ లేక ఏడుస్తూనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించటానికి అన్ని కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలో చున్ను కుమార్ సోదరుడుకి అనుమానం వచ్చింది. మృతదేహం ముఖాన్ని తేరిపార చూశాడు. చూసిన వెంటనే షాక్ అయ్యాడు. అది తన సోదరుడిది కాదని నిర్థారించుకున్నాడు. అదే విషయాన్ని అందరికీ చెప్పాడు. వాళ్లు కూడా ముఖాన్ని చూసి నిజమేనన్నారు.

దీంతో చనిపోయిన వ్యక్తి తమ కుటుంబ సభ్యుడు బ్రతికే ఉన్నాడని ఆశతో వెంటనే ఆసుపత్రి సిబ్బందికి తెలియజేశారు. వారు అక్కడికి వచ్చి ఆ మృతదేహం కరోనాతోనే మృతి చెందిన పూర్ణియాకు చెందిన రాజ్‌కుమార్‌దిగా గుర్తించారు. ఆ తరువాత చిత్రూ కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి చేరుకోగా..అక్కడ చున్ను కుమార్ ఆహారం తింటూ కనిపించాడు. దీంతో చిత్రూ కుటుంబ సభ్యుల ఆనందాన్ని అవధుల్లేవు. మరోవైపు చున్ను కుమార్ చనిపోయాడని చెప్పిన ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. బ్రకితి ఉండి నిక్షేపంలా అన్నం తింటున్న వ్యక్తిని పట్టుకుని చనిపోయాడని చెబుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆసుపత్రి హెడ్ డాక్టర్ ఠాకూర్ దర్యాప్తునకు ఆదేశాలు జారీచేశారు.

దీనిపై రోగి భార్య కవితా దేవి మాట్లాడుతూ..నా భర్త మరణించాడని ఆస్పత్రి సిబ్బంది ఫోన్ చేసిన చెప్పారనీ..ఆ విషయం విని మేం ఎంతో బాధపడి ఆందోళనగా సిబ్బంది చెప్పిన ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని చూసి అది నా భర్తది కాదని అతని సోదరుడు చెప్పాడని ఆ తరువాత మేం కూడా చూసి నిర్ధారించుకున్నామని..కానీ నా భర్త జీవించే ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని కానీ ఇటువంటి ఘోర పొరపాట్లు చేసిన సదరు ఆస్పత్రి నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామని తెలిపారు.