Russian Leader Died In Odisha : ఒడిశాలో రష్యా చట్టసభ ప్రతినిధి అనుమానాస్పద మృతి.. పుట్టినరోజు జరుపుకునేందుకు ఇండియాకు రాక

రష్యా చట్ట సభ ప్రతినిధి పావెల్ ఆంటోవ్ భారత్ లో మృతి చెందారు. ఒడిశాలోని ఓ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన 65వ పుట్టిన రోజు జరుపుకునేందుకు పావెల్ ఇండియాలో పర్యటిస్తున్నారు.

Russian Leader Died In Odisha : ఒడిశాలో రష్యా చట్టసభ ప్రతినిధి అనుమానాస్పద మృతి.. పుట్టినరోజు జరుపుకునేందుకు ఇండియాకు రాక

Pavel Antonov

Russian Leader Died In Odisha : రష్యా చట్ట సభ ప్రతినిధి పావెల్ ఆంటోవ్ భారత్ లో మృతి చెందారు. ఒడిశాలోని ఓ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన 65వ పుట్టిన రోజు జరుపుకునేందుకు పావెల్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో ఆయన వెకేషన్ కోసం వచ్చారు. ఈ నేపథ్యంలో హోటల్ లోని మూడో అంతస్తు కిటికీ నుంచి కింద పడి అతను మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

మల్టీ మిలియనీర్ అయిన పావెల్ కు గొప్ప దాతగా కూడా పేరుంది. రాయ్ గడ్ హోటల్ లోని శనివారం పావెల్ ను రక్తపు మడుగులో గుర్తించారు. రెండు రోజుల వ్యవధిలోనే రష్యాకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయవడం గమనార్హం. అదే హోటల్ లో బస చేస్తున్న ఇద్దరు రష్యన్లు మరణించడం పట్ల పలు అనుమానాలు కల్గుతున్నాయి. పావెల్ ఆంటోవ్ తో పాటు వాల్దిమర్ బిడనోవో కూడా మరణించారు.

Salman Rushdie: సల్మాన్ రష్దీపై దాడిని ఖండించిన భారత్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

అయితే ఇద్దరూ రష్యా అధ్యక్షులు పుతిన్ విమర్శకులుగా చెబుతున్నారు. ఒడిశా పోలీసులు ఈ మరణాల పట్ల క్రిమినల్ లింకును కొనుగొనలేదని రష్యా ఎంబసీ వెల్లడించింది. అయితే యుక్రెయిన్ పై జరుగుతున్న రష్యా దాడిని పావెల్ ఆంటోవ్ ఖండిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆంటోవ్ స్నేహితుడు మృతి చెందారు. అయితే ఆ డిప్రెషన్ లోనే పావెల్ మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

డిసంబర్ 22న బిడనోవ్ మృతి చెందాడు. ఇద్దరు రష్యన్ల మృతి పట్ల ఆరా తీస్తున్నామన్నారు.వ్లాదిమిర్ ఓబ్లాస్ట్ అసెంబ్లీలో పావెల్ సభ్యుడని తెలిపింది. ఒడిశాలో జరిగిన ఇద్దరి మరణాల గురించి
తెలుసునని చెప్పారు. చనిపోయిన వ్యక్తి బంధువులతో టచ్ లో ఉన్నామని తెలిపారు. అలాగే ఒడిశా స్థానిక అధికారులతో కూడా మాట్లాడుతున్నామని తెలిపారు. అయితే ఈ రెండు మరణాల్లో క్రిమినల్ కోణం బయటపడలేదని రష్యా ఎంబసీ పేర్కొంది.