నెలకు రూ.2లక్షలివ్వండి.. రైల్వేను సెట్ చేస్తానంటోన్న హ్యాకర్

నెలకు రూ.2లక్షలివ్వండి.. రైల్వేను సెట్ చేస్తానంటోన్న హ్యాకర్

రైల్వే ఐటీ సెక్యూరిటీ సిస్టమ్ బాగాలేదని తనకు నెలకు రూ.2లక్షలు ఇస్తే అంతా సెట్ చేస్తానని అంటున్నాడో హ్యాకర్. ఇదంతా నేరుగా రైల్వే పోలీస్ ఫోర్స్(ఆర్పీఎఫ్)ను సంప్రదించే కాంటాక్ట్ కుదుర్చుకోబోయే ప్రయత్నం చేశాడు. హ్యూగ్ గాప్స్ అనే కంపెనీ ద్వారా రైల్వే పోలీస్ ఫోర్స్(ఆర్పీఎఫ్)ను సంప్రదించి ఐటీ సెక్యూరిటీ సిస్టమ్‌ లోపాలను బయటపెట్టాడు. 

ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన హమీద్ అష్రఫ్‌ను దుబాయ్ లో ఉన్నట్లుగా గుర్తించారు. ఐఆర్సీటీసీలో ఉన్న లూప్ హోల్స్ ఆధారంగా ఫేక్ ఐఆర్సీటీసీ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసి తప్పుడు టిక్కెట్లు తయారుచేస్తున్న వారికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అతణ్ని పట్టుకోవాలని ఆర్పీఎఫ్ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. 

ఇటీవలే ఈ కేసు విషయంలో గులాం ముస్తఫా అనే వ్యక్తి అరెస్టు అయ్యాడు. ఏడో తరగతిలో ఉండగానే అష్రఫ్ ట్రైన్ ఈ టిక్కెటింగ్‌లో మోసాలు చేస్తున్నట్లు గుర్తించి 2016లోనే అరెస్టు చేశారు. ఐఆర్సీటీసీలో ఉన్న లూప్ హోల్స్ మొత్తం నాకు తెలుసు. మీరెందుకు నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. మీ ఏజెన్సీలు ఏం చేయలేవు.. నాకు అప్పగించి నెలకు రూ.2లక్షలు ఇవ్వండి అంతా సెట్ చేస్తా అంటూ రైల్వే అధికారులకు మెసేజ్ చేస్తున్నాడు. 

మీరు నమ్మాలంటే ఇవిగో.. నేను సేకరించిన వివరాలు అని టిక్కెట్ చేసుకున్న వారి వివరాలను బయటపెట్టాడు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ను చాలెంజ్ చేస్తూ.. బేరసారాలు మొదలుపెట్టాడు. మీరు నన్ను అరెస్టు చేస్తే ఇలాంటి సాఫ్ట్ వేర్ తో ఇంకో పది మంది బయటికొస్తారని బెదిరింపులకు దిగుగుతున్నాడు.  ఇలాంటి పనులు చేయడానికి నేను సిగ్గుపడటం లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి’ అని మెసేజ్ చేశాడు. 

అసలు దీనంతటికీ కారణం.. అష్రఫ్ తయారుచేసి అమ్మేసిన డూప్లికేట్ ఐఆర్సీటీసీ సాఫ్ట్‌వేర్. చేసిందంతా చేసి తాను ఆ సాఫ్ట్‌వేర్ పనిచేయకుండా ఉండేందుకు పోలీసులకు సాయం చేస్తానంటూ మెసేజ్ లు చేయడం మొదలుపెట్టాడు. రైల్వే పోలీసులు రిటర్న్ వార్నింగ్ లు ఇవ్వడంతో భయపడి బతిమాలుకుంటున్నాడు. 

‘సర్.. దీనిని నేను ముగించాలనుకుంటున్నాను. నా గర్ల్ ఫ్రెండ్ నేను లైఫ్‌ను ఎంజాయ్ చేయగలను. క్షమించి నన్ను కాపాడండి. మరోసారి రైల్వే సాఫ్ట్‌వేర్‌ను తయారుచేయను’ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. 

ఇంతకీ ఈ నిందితుడు చెప్పిన విధంగా రైల్వే సిస్టమ్ ను ఎలా హ్యాక్ చేస్తున్నాడంటే.. 
‘ఐఆర్సీటీసీ ఒక్క ఐపీ అడ్రస్ మీద రెండు టిక్కెట్లు తీసుకోవచ్చు. అలాగే ఒక్క ఐపీ అడ్రస్‌ నుంచి ఎన్ని ఐడీలతో లాగిన్ అయినా ఇబ్బందేం లేదు. ఈ అవకాశంతో ఒకే ఐపీ అడ్రస్ తో ఎక్కువ ఐడీలు లాగిన్ అయి టిక్కెట్లు బుక్ చేసుకుని సామాన్యులకు దొరకకుండా చేయొచ్చు’ అని అష్రఫ్ చెప్పాడు. అంతేకాకుండా అతను వాడుతున్న టెక్నాలజీతో ఓటీపీ.. కాప్చా లాంటి కోడ్ లను కూడా బైపాస్ చేయవచ్చని చెప్తున్నాడు.