Free Cylinder: పేటీఎంలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేయండిలా..

రీసెంట్ గా పేటీఎం లాంచ్ చేసిన ఆఫర్ ప్రతి ఒక్కరి గృహ అవసరం తీర్చేదిగా ఉంది. పేటీఎం తన యూజర్లు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ పొందొచ్చనే ఆఫర్ ప్రకటించింది.

Free Cylinder: పేటీఎంలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేయండిలా..

Paytm Free

Free Cylinder: డిజిటల్ ఇండియాకు ఇండియన్లు బాగా అలవాటుపడ్డారు. ఏది కావాలాన్నా కూర్చొన్న చోటికే వచ్చేస్తున్నాయి. ప్రతి అవసరాన్ని తీర్చగల డిజిటల్ ప్లాట్ ఫాంలు అంతకంతే ఆఫర్లతో ఊరిస్తున్నాయి కూడా. రీసెంట్ గా పేటీఎం లాంచ్ చేసిన ఆఫర్ ప్రతి ఒక్కరి గృహ అవసరం తీర్చేదిగా ఉంది. పేటీఎం తన యూజర్లు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ పొందొచ్చనే ఆఫర్ ప్రకటించింది.

భారత్ ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ ఉన్న వారు పేటీఎం నుంచి బుక్ చేసుకుని ఫ్రీగా సిలిండర్ అందుకోవచ్చు. ఇది కేవలం కొత్త యూజర్ల కోసం అనుకోవద్దు. ఆల్రెడీ యూజర్లు అయి ఉన్నా ఆఫర్ వర్తిస్తుందని చెప్తుంది పేటీఎం.

అంతేకాకుండా కొత్త యూజర్లకు అదనపు బెనిఫిట్స్ ఇచ్చేందుకు రెడీ అయింది పేటీఎం. ట్రాన్సాక్షన్ జరిగే సమయంలో కొత్త యూజర్ లేదా ఆల్రెడీ యూజర్ అయి ఉన్నారా అని అడుగుతుంది. ప్రొమో కోడ్ ఆప్షన్ దగ్గర మాత్రం ‘FREEGAS’ అని టైప్ చేస్తే ఫ్రీ సిలిండర్ పొందే అవకాశం దక్కుతుంది.

కొత్త యూజర్లు ‘FIRSTCYLINDER’ అనే కోడ్ ఎంటర్ చేస్తే రూ.30 క్యాష్ బ్యాక్ కూడా పొందే ఛాన్స్ ఉంది.

Read Also : ఈ నెల 14న పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం

* పేటీఎం యాప్ ఓపెన్ చేయండి.
* రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ ట్యాబ్ కిందే బుక్ గ్యాస్ సిలిండర్ ఆప్షన్ ఉంటుంది.
* అక్కడ గ్యాస్ ప్రొవైడర్ పేరు సెలక్ట్ చేయండి.
* వివరాలు ఎంటర్ చేసి, మీ మొబైల్ నెంబర్, ఎల్పీజీ ఐడీ, వినియోగదారుడి నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేయండి.
* వివరాలు నమోదు చేసిన తర్వాత కూపర్ కోడ్ ఎంటర్ చేయాలి.
* ప్రొసీడ్ అండ్ కంప్లీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అయిపోయినట్లే.

ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది పరిమిత ప్రొవైడర్లకు మాత్రమే వస్తుంది. ప్రస్తుతం పేటీఎం HP Gas, Indane, Bharat Gas యూజర్లకు మాత్రమే ఉచితంగా ఇస్తుంది.