Paytm : పేటీఎంకు ఎదురుగాలి..వెంటాడుతున్న నష్టాలు!

పేటీఎంకు నష్టాలు వెంటాడుతున్నాయి. గత సంవత్సరం వరుసగా రెండో త్రైమాసికంలో నష్టాలను పొందడం ఇది...రెండోసారి.

Paytm : పేటీఎంకు ఎదురుగాలి..వెంటాడుతున్న నష్టాలు!

Paytm

Paytm Q2 Results : పేటీఎంకు నష్టాలు వెంటాడుతున్నాయి. భారీ అంచనాలు సాధిస్తుందని అనుకుంటే..ఏదో ఒకటి అయ్యిందని అనుకుంటున్నారు. మార్కెట్ లలో తీవ్రమైన నష్టాలు కలుగుతున్నాయి. భారీ నష్టాలను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కంపెనీ తాజాగా విడుదల చేసిన క్యూ 2 ఫలితాలు వెల్లడిస్తున్నాయి. పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 481 కోట్ల 70 లక్షల రూపాయల నికర నష్టాలు వచ్చాయని అంచనా.

Read More : Major Cargo Ship Collision : అరేబియా సముద్రంలో ఢీకొన్న భారీ కార్గో షిప్ లు

ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలో 97 కమ్యూనికేషన్ మొత్తంగా 1,086 కోట్ల 40 లక్షల  రూపాయల మేర రికార్డు చేసింది. ఇదే గత ఆర్థిక సంవత్సర విషయానికి వస్తే…663 కోట్ల 90 లక్షల రూపాయలు నమోదు చేసింది. గత సంవత్సరం వరుసగా రెండో త్రైమాసికంలో నష్టాలను పొందడం ఇది…రెండోసారి అని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. క్యూ -1లో ఏప్రిల్ – జూన్ మాసంలో 376 కోట్ల 60 లక్షల రూపాయల మేర నష్టాలను చవి చూసినట్లు అంచనా.

Read More : Karnataka : కర్ణాటక వెళ్తే.. క్వారంటైన్, కొవిడ్ టెస్టు మస్ట్.. వారికి మాత్రమేనట!

కరోనా కారణంగా..డిజిటల్ చెల్లింపులు అధికమైన సంగతి తెలిసిందే. దీంతో పేటీఎం చెల్లింపుల వైపు చాలా మంది మొగ్గు చూపారు. దీంతో ఈ కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలు రెట్టింపు స్థాయిలో జరిగాయి. దీంతో పేటీఎం ఐపీవోకి వెళ్లింది. అక్కడ భారీ లాభాలను గడిస్తుందని..ఇన్వెస్టర్లు ఆశించారు. కానీ ఎదురుగాలి వీస్తుండడంతో లబోదిబోమంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.