పార్లమెంట్‌కు వచ్చిన చిదంబరం..మధ్యాహ్నం ప్రెస్ మీట్

  • Published By: madhu ,Published On : December 5, 2019 / 05:54 AM IST
పార్లమెంట్‌కు వచ్చిన చిదంబరం..మధ్యాహ్నం ప్రెస్ మీట్

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిదంబరం పార్లమెంట్ సమావేశాలకు 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం ఉదయం హాజరయ్యారు. INX మీడియా కేసులో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2019, డిసెంబర్ 04వ తేదీ బుధవారం సాయంత్రం ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. 106 రోజులు జైల్లో ఉన్నారు.

> మనీ లాండరింగ్ కేసుపై ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన చిదంబరం అరెస్ట్‌ అయ్యారు.
> చిదంబరం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ బెయిల్ పిటిషన్ సుప్రీంలో దాఖలు చేశారు. 
> చిదంబరంకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 
> మీడియాతో మాట్లాడకూడదు అంటూ ఆంక్షలు విధించిన కోర్టు. 
> మీడియా కంపెనీ ఐఎన్ఎక్స్‌పై 2017 మే 15న సిబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 
> ఫారెన్స్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ ఎన్నో అవతవకలకు పాల్పడిందని ఆరోపించింది.

ఇన్ని రోజులు జైలులో పెట్టినా..తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యాన్ని చూపించలేకపోయారని చిదంబరం విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో INX మీడియాలోకి విదేశీ నిధులు తరలించడంలో చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సీబీఐ, ఈడీ అభియోగాలు మోపాయి. గురువారం మధ్యాహ్నం చిదంబరం మీడియాతో మాట్లాడనున్నారు. 

> పెట్టుబడులు ఆమోదించిన సమయంలో పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. జరగబోయే దర్యాప్తును అడ్డుకోవడానికి యత్నించారని పి.చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంపై ఆరోపణలు వచ్చాయి. 
> గత ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ కార్తీని అరెస్టు చేసింది. 
> భారత్, యూకే, స్పెయిన్ దేశాల్లో కార్తీ చిదంబరానికి రూ. 54 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. 
> మనీ ల్యాండరింగ్ కేసు కూడా నమోదు చేశారు. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
> చిదంబరాన్ని పలుమార్లు విచారించింది ఈడీ. 
> చిదంబరానికి  కాంగ్రెస్,  ఆ పార్టీ నేతలు మద్దతు ప్రకటించారు. 
> బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే..ఆయనపై కక్ష గట్టి  కేంద్రం వేధిస్తోందని నేతలు ఆరోపించారు. 
> కాంగ్రెస్ చేసిన కక్ష సాధింపు వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తోంది.