నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతం

ఈ నియోజక వర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.కాగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన సుక్మా పరిధిలో కూడా

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 06:53 AM IST
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతం

ఈ నియోజక వర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.కాగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన సుక్మా పరిధిలో కూడా

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్‌  ప్రశాంతంగా సాగుతుంది. బస్తర్‌, దంతెవాడ, కుంట, బీజాపూర్‌, నారాయణ్‌పూర్‌, చిత్రకోట్‌, కోండగావ్‌, జగదల్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు. మావోల కదలికలు ఎక్కువగా ఉంటాయి. దీంతో కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి ఇక్కడ. సుక్మా పరిధిలో కూడా ఓటర్లు భారీ సంఖ్యలో ఓటు వేయటానికి పోలింగ్ కేంద్రాలకు తరలి రావటం విశేషం.

ఉదయం 9:30 గంటల వరకే 14 శాతం పోలింగ్‌ నమోదుకావటం విశేషం. పలు పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావటంతో.. ఓటర్ల భద్రత కోసం పట్టిష్టమైన ఏర్పాట్లు చేసింది. భయపడకుండా ఓటు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా..పోలింగ్‌ కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే నారాయణ్‌పూర్‌ జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రం దగ్గర నక్సల్స్ పెట్టిన బాంబును నిర్వీర్యం చేశారు.