Mumbai Child : చిన్నారికి రూ. 16 కోట్ల ఇంజక్షన్…సహాయం చేసిన 2.6 లక్షల మంది

చిన్నారి తీరా అందరికీ తెలిసే ఉంటుంది. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న ఈ చిన్నారికి రూ. 16 కోట్ల విలువ చేసే ఇంజక్షన్ వేశారు.

Mumbai Child : చిన్నారికి రూ. 16 కోట్ల ఇంజక్షన్…సహాయం చేసిన 2.6 లక్షల మంది

Spinal Muscular Atrophy

People Donate ₹ 16 Crore : చిన్నారి తీరా అందరికీ తెలిసే ఉంటుంది. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న ఈ చిన్నారికి రూ. 16 కోట్ల విలువ చేసే ఇంజక్షన్ వేశారు. ఇందుకు 2.6 లక్షల మంది సహాయం చేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. అనారోగ్యం కారణంగా..అత్యవసర చికిత్స కోసం ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చేరిపించారు. ‘ఇంపాక్ట్‌ గురు’ క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఆన్‌ లైన్‌ లో విరాళాల్ని సేకరించారు. కేవలం 42 రోజుల్లో ప‍్రపంచ దేశాలకు చెందిన 2.6 లక్షల మంది విరాళంగా అందించడంతో ముంబై హిందుజా ఆస్పత్రి వైద్యులు అమెరికా నుంచి జోల్‌ జెస్‌ స్మా ఇంజక్షన్‌ తెప్పించి చిన్నారి తీరాకు వేశారు.

ముంబైలోని అంధేరి ప్రాంతంలో మిహర్ కామత్, ప్రియాంక కామత్ లు నివాసం ఉంటున్నారు. వీరికి తీరా కుమార్తె ఉంది. అయితే..చిన్నారికి 8 నుంచి 10 వేల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే వెన్నెముక కండరాల సమస్య స్పైనల్ మస్క్యలర్ అట్రోఫి అనే జన్యుపరమైన లోపం తలెత్తింది. ట్రీట్మెంట్ కోసం రూ. 16 కోట్ల విలువ చేసే ఒక్క ఇంజక్షన్‌ జోల్ జెన్ స్మా తేవాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. జీవితాంతం కష్టపడినా..అంత డబ్బులు జమ చేయలేమని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టారు.

ఐదు నెలల చిన్నారి పరిస్థితిని చూసి చలించిపోయారు. దాతలు విరాళాలు జల్లును కురిపించారు. ఏకంగా రూ. 12 కోట్ల నిధులు సమకూరాయి. అయినా..మెడిసిన్స్ సరిపడా డబ్బులు సమకూరలేదు. జీఎస్టీ విధిస్తే..పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దాతలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు, అమెరికా నుంచి దిగమతి చేసుకబోయే..మెడిసిన్స్ కు సుంకాలు ఉండడంతో భారీగా భారం పడుతోందని తెలిపారు.

వివిధ రకాల పన్నులను మినహాయిస్తే…తన పాపకు చికిత్స అందుతుందని కోరారు. దిగుమతి సుంకాన్ని, జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ కేంద్రానికి ఫిబ్రవరి 01వ తేదీన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లేఖ రాశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సానుకూలంగా నిర్ణయాన్ని తీసుకున్నారు. మిహర్‌, ప్రియాంకలు ఆన్‌ లైన్‌ ద్వారా సేకరించిన విరాళాలతో ఇంజక్షన్‌ తెప్పించి బుధవారమే ఆ ఇంజక్షన్‌ వేశామని వైద్య నిపుణురాలు డాక్టర్ నీలూ దేశాయ్ వెల్లడించారు. ఆ ఇంజక్షన్‌ పాపపై బాగా పనిచేస్తోంది అన్నారు. మరోవైపు తమ పాప ఖర్చులకు ఇంత పెద్ద మొత్తంలో ప‍్రజలు విరాళం అందిస్తారని ఊహించలేకపోయామని తీరా తల్లిదండ్రులు అన్నారు. కేవలం 42 రోజుల్లో తమ కుమార్తె కోసం భారీ ఎత్తున విరాళాలిచ్చిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.