దేశం చూపు సరిహద్దులపైనే : వాఘా బోర్డర్ లో ఉత్కంఠ

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2019 / 06:54 AM IST
దేశం చూపు సరిహద్దులపైనే : వాఘా బోర్డర్ లో ఉత్కంఠ

భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుంది. దేశమంతా ఉప్పొంగే మనసుతో అభినందన్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మార్చి 1,2019 శుక్రవారం మధ్యాహ్నం అభినందన్ ను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియను పాక్ ప్రారంభించింది. ఇప్పటికే లాహోర్ చేసుకున్న అభినందన్ ను.. భారత్ ఎంబసీ కార్యాలయంలో అప్పగించనున్నారు. అక్కడి నుంచి బస్సులో భారత్ – పాక్ సరిహద్దులు అయిన వాఘా దగ్గరకు చేరుకుంటాడు అభినందన్.

పైలెట్ కు స్వాగతం పలికేందుకు భారత బలగాలు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఉత్కంఠ వాతావరణం ఉంది. భారీ బందోస్తు ఏర్పాట్లు జరిగాయి బలగాలు. పంజాబ్ పోలీస్ బలగాలు కూడా సరిహద్దులకు తరలివచ్చాయి. అమృత్ సర్ లో కూడా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అభినందన్ కు స్వాగతం పలికేందుకు అవకాశం ఇవ్వాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధానిని కోరారు.

అభినందన్ స్వస్థలం చెన్నైలో కూడా ఆ రాష్ట్ర హోంగార్డులు అభినందన్ క్షేమంగా భారత్ లో అడుగుపెట్టాలని కలికాండల్ ఆలయంలో పూజలు నిర్వహించారు.