కరోనా వచ్చిన వృద్ధులు చనిపోవల్సిందే.. మంత్రి వ్యాఖ్యలు

కరోనా వచ్చిన వృద్ధులు చనిపోవల్సిందే.. మంత్రి వ్యాఖ్యలు

Minister

కోవిడ్-19 కారణంగా పెరుగుతున్న మరణాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పశుసంవర్ధక మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కరోనాను నివారించడానికి అందరి సహకారం గురించి మాట్లాడుతూ.. ‘ముసలోళ్లు అయితే చనిపోవాల్సిందే’ కదా? అంటూ బాధ్యతలేకుండా కామెంట్లు చేశారు.

కరోనా కొత్త వేవ్ మధ్యప్రదేశ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. రాష్ట్ర ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత కొనసాగుతోంది. గత 24 గంటల్లో, మధ్యప్రదేశ్‌లోని నాలుగు పెద్ద నగరాల్లో 4600కి పైగా కొత్త కేసులు రాగా.. 25 మంది చనిపోయారు. ఒక వైపు ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. మరోవైపు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ మంత్రి మాత్రం వింత ప్రకటన చేశారు.

మధ్యప్రదేశ్ పశుసంవర్ధక మంత్రి ప్రింపాల్ సింగ్ పటేల్.. కోవిడ్ -19 కారణంగా మరణాల సంఖ్య పెరగడానికి సంబంధించిన ప్రశ్నలను అడిగినప్పుడు, “ఈ మరణాలను ఎవరూ ఆపలేరు. కరోనాను నివారించడానికి అందరూ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ప్రతిరోజూ కరోనా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. నేను అంగీకరిస్తా. ఈ మరణాలను ఎవరూ ఆపలేరు. వయసు మీద పడిన వారు చనిపోవాల్సిందే కదా?” అని అన్నారు.

ఇది మాత్రమే కాదు, మరణ గణాంకాలను ప్రభుత్వం దాచిపెడుతోందని మంత్రిని అడిగినప్పుడు, మంత్రి, “ప్రజలు కూడా దాక్కున్నారు. ఈ విషయం ఎవరితోనూ చెప్పట్లేదు.అంటూ వెటకారం చేశారు. ఈ విషయాలపై ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.