RSS Chief: ఫస్ట్ వేవ్ తర్వాత ప్రజలు, ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారు

జాతీయ వ్యాప్తంగా కనిపించిన కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ ప్రభావాన్ని ప్రజలు, ప్రభుత్వం తేలికగా తీసుకున్నాయి. అందుకే ప్రస్తుతం జాతీయవ్యాప్తంగా వైద్య సంక్షోభం కనిపిస్తుంది.

RSS Chief: ఫస్ట్ వేవ్ తర్వాత ప్రజలు, ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారు

Rss Chief

RSS Chief: జాతీయ వ్యాప్తంగా కనిపించిన కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ ప్రభావాన్ని ప్రజలు, ప్రభుత్వం తేలికగా తీసుకున్నాయి. అందుకే ప్రస్తుతం జాతీయవ్యాప్తంగా వైద్య సంక్షోభం కనిపిస్తుంది.

ఫస్ట్ వేవ్ తర్వాత అందరూ నిర్లక్ష్యంగా మారారు. ప్రజలు, ప్రభుత్వం, అడ్మినిస్ట్రేషన్ అంతా.. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసి డాక్టర్లు కూడా ముందుగానే హెచ్చరించారు. ఇప్పటికీ నిర్లక్ష్యంగానే ఉన్నాం.

ఇప్పుడు థర్డ్ వేవ్ పొంచి ఉందని మనకు చెప్తున్నారు. మనం దానికి భయపడాలా.. లేదంటే వైరస్ తో పోరాడేందుకు సిద్ధపడాలా అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కాన్ఫిడెన్స్ నింపేందుకు పాజిటివిటీ అన్ లిమిటెడ్ సిరీస్ లెక్చరర్స్ లో భాగంగా ప్రసంగించారు.

పలు సివిల్ సర్వీసెస్ గ్రూపులతో కలిసి కొవిడ్ రెస్పాన్స్ టీంతో పాటు ఆర్ఎస్ఎస్ సమన్వయమవుతుంది. మే11 నుంచి విప్రో గ్రూప్ ఫౌండర్ అజీమ్ ప్రేమ్ జీ, ఆధ్మాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ వస్తున్నారు.

జీవన చక్రంలో జీవితం, చావు కొనసాగుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలు మనల్ని భయపెట్టలేవు. ఈ పరిస్థితులు భవిష్యత్ కోసం మనం శిక్షణ పొందేందుకు ప్రేరణగా మారుతున్నాయి. సక్సెస్ అనేది ఫైనల్ కాదు. ఫెయిల్యూర్ అనేది అంతం కాదు. ధైర్యమే మనల్ని నడిపించేది. అంటూ చేసిన ప్రసంగం ఫేస్ బుక్ పేజిలోనూ, యూట్యూబ్ ఛానెల్ లోనూ ప్రసారమైంది.