King Charles III Coronation : కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి హాజరవుతున్న భారతీయులు వీరే..

70 ఏళ్ల తరువాత బ్రిటన్ రాజకుటుంబంలో రాజుకు పట్టాభిషేకం మరికొన్ని గంటల్లో జరుగనుంది. అంగరంగ వైభోగంగా జరిగే ఈ వేడుకకు భారతీయులు హాజరవుతున్నారు.

King Charles III Coronation : కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి హాజరవుతున్న భారతీయులు వీరే..

King Charles III coronation

King Charles III coronation : 70 ఏళ్ల తరువాత బ్రిటన్ రాజకుటుంబంలో రాజుకు పట్టాభిషేకం మరికొన్ని గంటల్లో జరుగనుంది. అంగరంగ వైభోగంగా జరిగే ఈ వేడుకకు పలుదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. వీరిలో భారతీయులు కూడా ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా..రాజకుటుంబ సంప్రదాయాలతో వందల ఏళ్ల చరిత్ర కలిగిన కళాఖండాల ఆకృతులతో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో జరుగనుంది.ఈ వేడుకకు భారతదేశం నుంచి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. వీరిలో బాలివుడ్ నటి సోనమ్ కపూర్ కూడా ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఈ వేడుకలో ఉండనున్నారో తెలుసుకుందాం..

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్: భారత ప్రభుత్వం తరపున ధన్ కర్ అధికారికంగా హాజరవుతున్నారు. మే 6న జరుగనున్న ఈ వేడకకు 5నే సతీసమేతంగా లండన్ చేరుకున్నారు ఉప రాష్ట్రపతి జగదీప్. లండన్ లో దిగగానే ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది.

బాలివుడ్ నటి సోనమ్ కపూర్ : కింగ్ చార్లెస్ పట్టాభిషేకం వేడుకల్లో కామన్వెల్త్ గాయక బృందం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ బృందానికి స్వాగతం పలుకుతూ సోనమ్ కపూర్ మాట్లాడనున్నారు. అతి స్వల్ప సమయమే అయినా సోనమ్ కపూర్ ఈ వేడకల్లో మెరిసిపోనున్నారు.

యూకే ప్రధాని రిషి సునక్ భార్య అక్షతామూర్తి : యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య, ప్రథమ మహిళ అక్షతా మూర్తి రాజకుటుంబ పట్టాభిషేకం వేడుకలకు హాజరవుతారు.

ముంబై డబ్బావాలాలు: ముంబైలో అత్యంత పేరుగాంచిన డబ్బావాలాల తరపున వారి ప్రతినిధి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా రాజుకు వర్కారీ కమ్యూనిటీ తయారు చేసిన పునేరీ పగిడిని కానుకగా ఇవ్వనున్నారు. పగిడీతో పాటు పాటు శాలువా బహూకరిస్తారు. ముంబైలో లంచ్ బాక్సులు అందిస్తూ డబ్బావాలాలు ఎంతో సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. 2003లో చార్లెస్ భారత పర్యటకు వచ్చినప్పుడు డబ్బావాలపై ప్రశంసలు కురిపించారు. ముంబై డబ్బా వాలాలను బ్రిటన్ రాజకుటుంబంతో సుదీర్ఘకాలంలోసంబంధాలు కొనసాగుతున్న క్రమంలో డబ్బావాలాల తరపున వారి ప్రతినిధి హాజరవుతున్నారు.

సౌరభ్ పడ్కే : పూణెకు చెందిన 37 ఏళ్ల సౌరభ్ ఒక ఆర్కిటెక్ట్. చార్లెస్ ఫౌండేషన్, ప్రిన్స్ ఫౌండేషన్ స్కూల్ లో ఆయన చదువుకున్నారు. సౌరభ్ 2018-19లో హిల్స్‌బరో కాజిల్ యొక్క గోడల తోట నడిబొడ్డున సమ్మర్‌హౌస్ యొక్క “లైవ్ బిల్డ్”ను పూర్తి చేసిన విద్యార్థులలో ఒకరు. చాలా కాలంగా కింగ్ చార్లెస్ స్వచ్ఛంద సంస్థలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు సౌరభ్.

గుల్ఫ్ షా: ఢిల్లీకి చెందిన 33 ఏళ్ల గుల్ఫ్ షా గత ఏడాది ప్రిన్స్ ట్రస్ట్ గ్లోబల్ అవార్డును అందుకున్నారు. కన్స్ స్ట్రక్షన్ ప్రాజెక్టులకు ప్రైస్ ఎస్టిమేట్స్ అందించే కంపెనీలో పని చేస్తున్నారు. భారతదేశంలో జన్మించి, భారతదేశంలో గెట్ ఇన్‌టు కార్యక్రమంలో పాల్గొన్నందుకు 2022లో ది ప్రిన్స్ ట్రస్ట్ గ్లోబల్ అవార్డును అందుకున్న గల్ఫ్‌షా మే 6న జరిగే పట్టాభిషేక సేవకు హాజరవుతారు.

జై పటేల్: కెనడాలో నివసించే భారతీయుడు జైపటేల్. టొరంటోలోని ఐకానిక్ సీఎన్ టవర్ లో షెఫ్ గా పని చేస్తున్నారు. ‘ప్రిన్స్ ట్రస్ట్ కెనడా’ అందించే కెనడాస్ యూత్ ఎంప్లాయ్ మెంట్ ప్రోగ్రామ్ ను గత ఏడాది పూర్తి చేశారు. మే 2022లో ప్రిన్స్ ట్రస్ట్ కెనడా యూత్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్ నుండి పట్టా పొందిన ఇండో-కెనడియన్ జే పటేల్ కూడా పట్టాభిషేక కార్యక్రమానికి హాజరవుతున్నారు.

మంజు మల్హి: కోవిడ్ సమయంలో లండన్‌లోని కమ్యూనిటీకి చేసిన సేవలకు దివంగత రాణి బ్రిటిష్ ఎంపైర్ మెడల్ (BEM) మంజూరు చేసిన భారతీయ సంతతికి చెందిన మంజు మల్హి.. పట్టాభిషేకానికి ఆహ్వానించబడిన 850 మంది BEM గ్రహీతలలో ఒకరు.

బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్-3 ఈరోజు పట్టాభిషక కార్యక్రమానికి 203 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు 12 వేల మంది పోలీసులు,10 వేల మంది సైనికులను మోహరించారు.