నవరాత్రి స్పెషల్ : మోడీ మాస్క్ లతో గర్భా నృత్యం

  • Published By: venkaiahnaidu ,Published On : October 5, 2019 / 03:26 AM IST
నవరాత్రి స్పెషల్ : మోడీ మాస్క్ లతో గర్భా నృత్యం

నవరాత్రి వేడుకల్లో భాగంగా సూరత్‌లో నిర్వహించిన గర్భా నృత్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మెరిసిపోయే దుస్తులతో యువతులు ప్రధాని మోడీ మాస్క్ లను ధరించి  నృత్యం చేసి మైమరిపించారు.  ఇక కొందరు యువతులైతే ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను సరికొత్త పద్ధతిలో సెలబ్రేట్ చేసుకున్నారు.

కొంతమంది యువతులు.. తమ శరీరంపై సామాజిక బాధ్యతగా ఆలోచించే టాటూలను వేయించుకున్నారు. ఓ యువతి తన వీపుపై చంద్రయాన్-2ను టాటూను, మరో యువతి ఆర్టికల్ 370, 35ఏ టాటూను, ఇంకో అమ్మాయి ట్రాఫిక్ రూల్స్‌ను ఫాలో కావాలని చూపించే టాటూలను,ఇలా వివిధ రకాల టాటూలు వేయించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.