Corona Heart Attack : కరోనా సోకిన వారికి గుండెపోటుతోపాటు అనేక రోగాలు!

కరోనా వైరస్ ఎక్కువ సార్లు సోకిన వారిలో ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ముప్పు కూడా మూడున్నర రెట్లు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఆస్తమా, దీర్ఘకాల శ్వాసకోస సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని వెల్లడించారు.

Corona Heart Attack : కరోనా సోకిన వారికి గుండెపోటుతోపాటు అనేక రోగాలు!

Corona Heart Attack

Corona Heart Attack : కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను గజ గజ వణికించిన విషయం తెలిసిందే. వైరస్ బారిన పడి లక్షలాది మంది మరణించారు. కరోనా వైరస్ పేరు వింటేనే జనం హడలెత్తిపోయారు. కరోనా మొదలైన కొత్తలో ఉన్నంత భయం ఇప్పుడు లేదు. అయితే భయం తగ్గడం మంచిదే కానీ, కరోనా పట్ల అప్రమత్తంగా ఉండకపోవడం మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. పదే పదే కరోనా బారిన పడటం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కరోనా కారణంగా గుండెపోటుతోపాటు మరెన్నో రోగాలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసార్లు కరోనా బారిన పడిన వారిలో గుండె కండరాల వాపు(మయోకార్డిటిస్) సమస్య వచ్చే ముప్పు మూడు రెట్లు అధికంగా ఉంటుందని అంటున్నారు. మయోకార్డిటిస్ వల్ల గుండెపోటుకు గురయ్యే ముప్పు, డయాబెటిస్ తోపాటు బీపీ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

Covid-19 Cases: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు

కరోనా వైరస్ ఎక్కువ సార్లు సోకిన వారిలో ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ముప్పు కూడా మూడున్నర రెట్లు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఆస్తమా, దీర్ఘకాల శ్వాసకోస సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని వెల్లడించారు. మరోవైపు దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా  యాక్టివ్ కేసుల సంఖ్య 31 వేలు దాటింది.

కొత్తగా 6వేల115 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనా బారిన పడి 11 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63 శాతంగా నమోదు అయింది. ఢిల్లీ, కేరళలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కేరళలో శనివారం ఒక్కరోజే 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళం, తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

Covid-19: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో 3824 కొత్త కేసులు

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. అలాగే, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లను అధిక సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఢిల్లీలో కొత్తగా 535 కరోనం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20 వేల 13 లక్షల 938కు చేరింది. వీటిలో 26 వేల 536 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 23.05 శాతానికి పెరిగింది. జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు ఉంటే తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్ XBB.1.16 వేరియంట్ కారణమని అనుమానిస్తున్నారు. వేరియంట్ తో భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు బూస్టర్ డోస్ తీసుకోవడంతో నిబంధనలు పాటిస్తే సరిపోతుందని తెలిపారు. కాగా, ఇన్ ఫ్లూయెంజా సబ్ టైప్ హెచ్3ఎన్2 కారణంగా ఇన్ ఫ్లూయెంజా కేసుల సంఖ్య పెరగడానికి కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.