లాక్‌డౌన్ తో కరోన కట్టడి ప్రయోజనమైతే, ప్రమాదాలు ఇవే..

  • Published By: veegamteam ,Published On : March 23, 2020 / 10:38 AM IST
లాక్‌డౌన్ తో కరోన కట్టడి ప్రయోజనమైతే, ప్రమాదాలు ఇవే..

ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోనా వైరస్ తో ఇప్పుడు భారత్ పోరాడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా షట్ డౌన్ దిశగా కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు,హైదరాబాద్ వంటి నగరాలు పూర్తిగా లాక్ డౌన్ అయ్యాయి. రైళ్లు, మెట్రో సర్వీసులు, ఇంటర్ స్టేట్ బస్సులను దేశ వ్యాప్తంగా రద్దు చేశారు. మాల్స్, సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీలు, జిమ్స్ అన్ని మూసేశారు.

లాక్ డైన్ వల్ల ప్రమాదాలు 

క‌రోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు విల‌విల‌లాడుతున్నాయి. క‌రోనా వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంద‌న్న నేప‌థ్యంలో…దలాల్ స్ట్రీల్ లో రక్తకన్నీరు పారుతుంది. ఈ వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోంది. ఈ వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. రోజుకు లక్షలాది మందికి పని లేకుండా చేస్తోంది. పేద ప్రజలకు పనులు లేక ఇంట్లోనే ఉంటు ఆకలికి అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 ఇక మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై, పుణే, నాగపూర్ నగరాల్లో ఆఫీసులు, దుకాణాలను మూసివేయాలని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర సేవలకు సంబంధించిన కార్యాలయాలు మాత్రమే తెరిచి ఉంటాయని మహా సర్కారు వెల్లడించింది. ఆఫీసులు, షాప్‌ల మూసివేత వల్ల చాలా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. కర్మాగారాలు, దుకాణాలు, కార్యాలయాలు మూసివేయడంతో మహారాష్ట్రలో ఆర్థిక స్థితిగతులు ఇతర రాష్ట్రాలకు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబై..దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు దేశ ఆర్థికరాజధానే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయిందటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇక పేద ప్రజలకు పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS), మధ్యాహ్నం భోజనం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) మద్దతుగా ఉన్న సామాజిక భద్రతా పథకాలను బాగా ఉపయోగించుకోవడం, పెన్షన్ల ముందస్తు చెల్లింపు, మెరుగైన పిడిఎస్ రేషన్లు, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ వేతన బకాయిలను వెంటనే చెల్లించడం, పాఠశాలలు, అంగన్‌వాడీలలో టేక్-హోమ్ రేషన్ల విస్తరణ పంపిణీ వంటివి… కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధమైన ఉపయోగకరమైన చర్యలను తీసుకున్నాయి, అయితే సహాయక చర్యల స్థాయికి తీవ్రమైన విస్తరణ అవసరం. దానికి, కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద డబ్బు అవసరం.

అంతేకాదు అవసరమైన సేవలను మూసివేయడం వల్ల ప్రజల కష్టాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ప్రజా రవాణా, అడ్మినిష్ట్రేటీవ్ ఆఫీసులు, కోర్టు విచారణలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ప్రాజెక్టులు, ఇమ్యునైజేషన్ డ్రైవ్‌లు కూడా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో వివిధ స్థాయిలకు నిలిపివేయబడ్డాయి. ప్రజా సేవలను నిలిపివేయడం ఆరోగ్య సంక్షోభాన్ని అరికట్టడానికి సహాయపడినప్పటికీ, ఆర్థిక పరిణామాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరం.