Greater Noida: పెరుగుతోన్న పెంపుడు జంతువుల దాడి.. లిఫ్టులో స్కూలు విద్యార్థిని కరిచిన కుక్క

నోయిడా అథారిటీ ఇటీవల పెంపుడు జంతువులకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలు లేదా పిల్లుల వివరాలను 31 జనవరి 2022లోపు నమోదు అథారిటీ ముందు చేయాలి. లేదంటే జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు

Greater Noida: పెరుగుతోన్న పెంపుడు జంతువుల దాడి.. లిఫ్టులో స్కూలు విద్యార్థిని కరిచిన కుక్క

Pet Dog Bites Schoolboy In Apartment Building Lift

Greater Noida: కొద్ది రోజులుగా అపార్ట్‭మెంట్లలోని లిఫ్ట్లుల్లో మనుషులపై ముఖ్యంగా పిల్లలపై పెంపుడు జంతువుల దాడులు పెరిగాయి. ముఖ్యంగా కుక్కలు చేస్తున్న దాడులు ప్రధానంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో జరిగినప్పటికీ లిఫ్టుల్లో పెట్టిన సీసీటీవీ కెమెరాల కారణంగా ప్రస్తుతం పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉన్న గ్రేటర్ నోయిడాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ అపార్ట్‭మెంట్‭లోని లిఫ్టులో వెళ్తుండగా.. స్కూలు విద్యార్థిని పెంపుడు కుక్క కరిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో ప్రకారం.. ఒక బాలుడు తన తల్లితో కలిసి స్కూల్‌కు వెళ్తున్నాడు. ఇంట్లో నుంచి వచ్చి లిఫ్టు ఎక్కారు. లిఫ్టులో వెళ్తుండగా ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కతో ఎక్కాడు. అంతే, కాసేపటితో ఆ పెంపుడు కుక్క విద్యార్థిపై దాడికి దిగింది. ఆ చిన్నారికి గాయాలు చేసింది. విద్యార్థిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా నాలుగు ఇంజెక్షన్లు చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని లా రెసిడెన్సియా సొసైటీలో చోటు చేసుకుంది.

నోయిడా అథారిటీ ఇటీవల పెంపుడు జంతువులకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కలు లేదా పిల్లుల వివరాలను 31 జనవరి 2022లోపు నమోదు అథారిటీ ముందు చేయాలి. లేదంటే జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. పెంపుడు కుక్కలు లేదా పిల్లుల వల్ల ఏదైనా గాయం జరిగితే యజమానులకు 10,000 రూపాయలు జరిమానా విధించనున్నట్లు కూడా ఆ విధానాల్లో నోయిడా అథారిటీ పేర్కొంది.

“నోయిడా అథారిటీ యొక్క 207వ బోర్డు సమావేశంలో, వీధి, పెంపుడు కుక్కలు, పెంపుడు పిల్లుల కోసం నోయిడా అథారిటీ యొక్క విధాన రూపకల్పనకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. నోయిడా ప్రాంతానికి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి అధికార యంత్రాంగం ఈ విధానాన్ని నిర్ణయించింది” అని నోయిడా అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రీతూ మహేశ్వరి ట్వీట్‌ చేశారు.

Musk Ultimatum: ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పిన మస్క్.. అలా చేయకపోతే ఇక ఎవరైనా ఇంటికేనట!