Pet Dogs Abandoned: వీధుల్లో పెంపుడు కుక్కలు.. విదేశీ బ్రీడ్లను రోడ్లపై వదిలేస్తున్న యజమానులు.. కారణం అదేనా?

పిట్‌బుల్, జర్మన్ షెఫర్డ్‌తోపాటు పలు జాతులకు చెందిన కుక్కలు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. వాటిని యజమానులే రోడ్లపై వదిలేసి వెళ్తున్నారు. రాత్రిపూట, ఎవరూ లేని సమయంలో వాటిని వదిలించుకుంటున్నారు. దీనికి కారణం ఉంది.

Pet Dogs Abandoned: వీధుల్లో పెంపుడు కుక్కలు.. విదేశీ బ్రీడ్లను రోడ్లపై వదిలేస్తున్న యజమానులు.. కారణం అదేనా?

Pet Dogs Abandoned: ఉత్తర ప్రదేశ్‌లో పెంపుడు కుక్కలు కలకలం రేపుతున్నాయి. ఖరీదు పెట్టి కొన్న విదేశీ బ్రీడ్ల కుక్కల్ని యజమానులు వీధుల్లో వదిలేస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇలాంటి కుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడాలో అనేక చోట్ల విదేశీ కుక్కలు, అరుదైన జాతికి చెందిన కుక్కలు వీధుల్లో కనిపిస్తున్నాయి.

Chandigarh University: ఛండీఘడ్ యూనివర్సిటీలో కొనసాగుతున్న నిరసనలు.. అధికారులు అబద్ధాలు చెబుతున్నారంటున్న విద్యార్థులు

వాటిలో పిట్‌బుల్, జర్మన్ షెఫర్డ్ కుక్కలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, దీనికి కారణం ఉంది. ఇటీవల పిట్‌బుల్, జర్మన్ షెఫర్డ్‌తోపాటు పలు జాతులకు చెందిన కుక్కలు యజమానులపై దాడులకు పాల్పడ్డాయి. డెలివరీ పర్సన్స్, పిల్లలు, వృద్ధులు, మహిళలపై దాడులు చేశాయి. ఇద్దరు మరణించినట్లుగా కూడా రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఇప్పటివరకు వీటిని పెంచుకుంటున్న యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ కుక్కలు తమపై కూడా ఎక్కడ దాడికి పాల్పడుతాయోనని భయపడుతున్నారు. అందుకే కొందరు వీటిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వీటిని యజమానులు రాత్రిపూట వీధుల్లో వదిలేసి వెళ్తున్నారు.

Bone-chilling video: అమానుషం.. కుక్కను కారుకు కట్టుకుని ఈడ్చుకెళ్లిన డాక్టర్.. వీడియో వైరల్

దీంతో ఈ కుక్కలు వీధుల్లో తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఈ అంశంపై స్థానిక అధికారులు, స్వచ్చంద సంస్థలు స్పందించాయి. గత 15 రోజుల్లోనే 9 కుక్కల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఒక సంస్థ తెలిపింది. వీధుల్లో వదిలేస్తున్న కుక్కలన్నీ హానికర బ్రీడ్లుగా చెబుతున్నవేనని సంస్థ నిర్వాహకులు అంటున్నారు. ఇప్పటికే ఇలాంటి కుక్కలకు సంబంధించిన 200కు పైగా కాల్స్ వచ్చాయని వాళ్లు చెబుతున్నారు. అయితే, ఇలా కుక్కల్ని వదిలేసే యజమానులపై చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. ఇలాంటి కుక్కలను పెంచుకుంటున్న యజమానుల వివరాల్ని సేకరిస్తున్నారు. కుక్కల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కుక్కల్ని వీధుల్లో వదిలేసే వాళ్లపై సెక్షన్ 428 కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు.