జైల్లో ఉండే విడాకులు: విడిపోయిన పీటర్, ఇంద్రాణి ముఖర్జీ

  • Published By: vamsi ,Published On : October 4, 2019 / 03:08 AM IST
జైల్లో ఉండే విడాకులు: విడిపోయిన పీటర్, ఇంద్రాణి ముఖర్జీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో నిందితులైన భార్యాభర్తలు ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీలకు ముంబై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2012లో కూతురు షీనాబోరాని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటనలో నిందితులైన దంపతులు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీలను అరెస్టు చేసి వేర్వేరు జైళ్లలో పెట్టారు పోలీసులు.

పీటర్ ముఖర్జీ (64) ఎలక్ట్రానిక్ మీడియా అధిపతి కాగా తన కంటే 16 ఏళ్ల వయసు చిన్నదైన ఇంద్రాణిని పీటర్ పెళ్లి చేసుకున్నారు. అయితే హత్య కేసులో జైలులో ఉన్న భార్యాభర్తలు పీటర్, ఇంద్రాణిలు తమకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. విడాకుల కోసం భార్యాభర్తలిద్దరూ అంగీకరించడంతో విడాకులు మంజూరు చేసింది కోర్టు. ఫ్యామిలీ కోర్టుకు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణిలు హాజరయ్యారు.

పీటర్ ముఖర్జీకి ఎంతోమంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, అతనికి విలువలు అనేవి లేవని అందుకే నాకు అతనితో విడాకులు కావాలని ఇంద్రాణి కోరింది. షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ. కన్న కూతురిని కసాయిలా చంపేసింది. ప్రస్తుతం ఈ కేసులోనే ఇంద్రాణి ముంబై జైల్లో ఉన్నది. పీటర్ ముఖర్జీ కూడా షీనా బోరా హత్యకేసులో ముద్దాయే.

ఇంద్రాణికి మొదటి భర్త ద్వారా  షీనాబోరా, మిఖాయిల్ పుట్టారు. తర్వాత ఆమె సంజీవ్ ఖన్నాను పెళ్లి చేసుకుంది. అతడికి కూడా విడాకులు ఇచ్చి పీటర్ ముఖర్జిని పెళ్లి చేసుకుంది. రెండవ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ లతో కలిసి షీనాను 2012లో చంపేసింది ఇంద్రాణి. అందుకు ప్లాన్ వేసింది పీటర్ ముఖర్జియే అని సీబీఐ అంటుంది. పీటర్ ముఖర్జికి మొదటి భార్య ద్వారా పుట్టిన కొడుకు రాహుల్,  షీనాబోరా మధ్య ఏర్పడిన ప్రేమే హత్యకు కారణం.