Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

అలాగే ప్రజలకు భద్రత కల్పించడానికి రైళ్లలో కవచ్ ప్రొటెక్షన్ సిస్టమ్ వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

Odisha Train Accident (1)

Supreme Court petition : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. మూడు రైళ్ల ప్రమాద ఘటనపై రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో నిపుణుల బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ లాయర్ విశాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ప్రజలకు భద్రత కల్పించడానికి రైళ్లలో కవచ్ ప్రొటెక్షన్ సిస్టమ్ వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.

జూన్ 2న సాయంత్రం 7 గంటల సమయంలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందగా, మరో 1100 మందికి గాయాలయ్యాయి. ఒడిశాలోని బలాసోర్ సమీపంలో శుక్రవారం లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది.

Adhir Ranjan Chaudhary: ఆ పనేదో ముందే చేసిఉంటే ఇతంటి ఘోరం జరిగేది కాదు..

దాని కంపార్ట్ మెంట్ లు మెయిన్ లైన్ పై పడ్డాయి. అయితే కొన్ని నిమిషాల్లోనే మెయిన్ లైన్ లో వచ్చిన యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. భువనేశ్వర్ ఎయిమ్స్ లో ప్రస్తుతం 100 గుర్తుపట్టలేని మృతదేహాలు ఉన్నాయి.
రైలు ప్రమాదంలో గుర్తుపట్టలేనంతగా శరీరాలు చిన్నాభిన్నమయ్యాయి.

బాధితులను ఆస్పత్రులకు, స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్సులు ఏపీ, తమిళనాడు నుంచి బలాసోర్ కు చేరుకున్నాయి. ఏపీ నుంచి బలాసోర్ ఫకీర్ మోహన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి 10 అంబులెన్స్ చేరుకున్నాయి. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఇప్పటికే రైల్వే సేఫ్టీ కమిషన్ దర్యాప్తు నివేదికను పూర్తి చేశారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Ashwini Vaishnav: ప్రమాద ఘటనకు గల కారణాలు.. అందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించాం.. బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు

రిపోర్టు తమకు అందాల్సివుందని పేర్కొన్నారు. అయితే నివేదిక రావడానికి ముందే బాధ్యులను గుర్తించామని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ ను మార్చడం ద్వారానే ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ నులపైనే ఉందని పేర్కొన్నారు.