Delhi High Court : సిగరెట్ బాక్సులపై ముద్రించినట్టుగానే లిక్కర్ సీసాలపైనా హెచ్చరికలు ఉండాలి

సిగరెట్ బాక్సులపై ముద్రించినట్టుగానే లిక్కర్ సీసాలపైనా హెచ్చరికలు ముద్రించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.

Delhi High Court : సిగరెట్ బాక్సులపై ముద్రించినట్టుగానే లిక్కర్ సీసాలపైనా హెచ్చరికలు ఉండాలి

Delhi High Court

Health warning on liquor bottle? : సిగరెట్ బాక్సులపై ముద్రించినట్టుగానే లిక్కర్ సీసాలపైనా హెచ్చరికలు ముద్రించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. సిగరెట్ ప్యాకెట్లపై ఉపయోగించే హెచ్చరిక గుర్తు మాదిరిగానే మద్యం సీసాలు ప్యాకేజీలపై ‘ఆరోగ్య హెచ్చరిక’ను ప్రచురించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం (మార్చి4,2022) ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కానీ దీనిపై నోటీసు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది.

ఢిల్లీలో మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు (డ్రగ్స్) నిషేధించాలని లేదంటే కనీసం వాటిని నియంత్రించేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సిగరెట్ బాక్సులపై ముద్రించినట్టుగానే లిక్కర్ సీసాలపైనా హెచ్చరికలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ కోర్టును కోరారు.

Also read : Russia-Ukraine war : నడిరోడ్డుపై రష్యా ల్యాండ్‌మైన్‌..నోటిలో సిగిరెట్ ఉంచుకునే ఒట్టి చేతులతో తీసేసిన యుక్రెయిన్ పౌరుడు

ఔషధంగా ఇచ్చే లిక్కర్ సీసాలపై హెచ్చరికలు ముద్రించడం సాధ్యపడదని ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటానికి ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంలో ఏం చేయగలమన్నది తదుపరి విచారణ సందర్భంగా పరిశీలిస్తామంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం జూలై 4కు వాయిదా వేసింది.

ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన పౌరులకు తెలియజేసే హక్కు, సమాచార హక్కు,ఆరోగ్య హక్కును రక్షించడానికి ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా ద్వారా మత్తు పానీయాల ‘ఆరోగ్యం,పర్యావరణ హాని’ గురించి ప్రచారం చేసేలా అధికారులను ఆదేశించాలని పిటిషన్ తో కోరారు. మత్తు పానీయాలు,డ్రగ్స్ ఉత్పత్తి, పంపిణీ అలాగే వినియోగంపై హెల్త్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషనర్ కోరారు.

Also read : స్మోకింగ్ అలవాటుందా? మీకు కరోనాతో రెండింతలు రిస్క్

గత ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీని భారతదేశానికి మద్యం రాజధానిగా చేసిందని పిటిషనర్ ఆరోపిస్తూ, ఢిల్లీలో మొత్తం 280 మున్సిపల్ వార్డులు ఉన్నాయని వాటిలో 250 మద్యం దుకాణాలు ఉన్నాయని..అంటే సగటున వార్డుకు ఒక మద్యం దుకాణం ఉందని పిటిషనర్ తెలిపారు.

ధూమపానం కంటే మద్యపానం పది రెట్లు ప్రమాదకరమని, అయితే మద్యం బాటిళ్లపై ఆరోగ్య హెచ్చరికను ఉపయోగించలేదని, సిగరెట్ ప్యాకెట్లపై ఉన్నట్లుగా అన్ని ఆల్కహాల్ బాటిళ్లలో తప్పనిసరిగా ఆరోగ్య హెచ్చరికలను కలిగి ఉండాలని కోరింది.

Also read : Cigarette affect : ఒక్క సిగరెట్..18 మందికి కరోనా అంటించేసింది..!