New Parliament : కొత్త పార్లమెంట్ భవనం రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్

కొత్త పార్లమెంటరీ భవనం భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది CR జయ సుకిన్ పిటీషన్ దాఖలు చేశారు.

New Parliament : కొత్త పార్లమెంట్ భవనం రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్

New Parliament Inauguration Supreme Court

New Parliament Inauguration : కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం చుట్టూ రగడ జరుగుతోంది. కొత్త భవనాన్ని ప్రారంభించే అవకాశం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిని అవమానపరుస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భవనాన్ని ప్రధాని ప్రారంభించడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. 19 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ప్రకటించాయి..

ఈక్రమంలో నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ పంచాయితీ సుప్రీంకోర్టుకి చేరింది.కొత్త పార్లమెంటరీ భవనం భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది CR జయ సుకిన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది. ఈ పిటీషన్ విషయంలో ప్రతివాదులుగా లోక్ సభ సెక్రటరీ జనరల్,హోంశాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులని చేర్చారు న్యాయవాది జయ సుకిన్.

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రగడ.. ఎవరు ఏమంటున్నారంటే?

మే 18న లోక్‌సభ సెక్రటరీ జనరల్ జారీ చేసిన ఆహ్వానాలు ప్రోటోకాల్ పాటించలేదని,రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు పిటిషనర్ జయ సుకిన్. చట్టవిరుద్ధం, ఏకపక్షంగా, అన్యాయంగా అధికార దుర్వినియోగం చేస్తూ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉందని న్యాయవాది సుకిన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం అనేది రికార్డులను సరిగ్గా పరిశీలించకుండా, భారత రాజ్యాంగం, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా ప్రారభోత్సవం జరుగుతుందని.. లోక్‌సభ సెక్రటరీ జనరల్ జారీ చేసిన ఆహ్వానాలు సహజ న్యాయం యొక్క ప్రాథమిక సూత్రాలను పాటించకుండా రాజ్యాంగం లోని ఆర్టికల్ 21, 79, 87 ఉల్లంగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో కేంద్ర నిర్ణయం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16, 21కి అనుగుణంగా కేంద్రం వ్యవహరించడం లేదని పేర్కొన్నారు.

New Parliament Building : కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 19 ప్రతిపక్ష పార్టీలు..