Facebook : ఉత్తరాఖండ్‌ హైకోర్టులో ‘ఫేస్‌బుక్‌’ పై పిటిషన్

ఫేస్‌బుక్‌కు భారీ షాక్‌ తగిలింది. న్యూడిటీని, ఫేక్‌ అశ్లీల వీడియోలను ప్రమోట్‌ చేస్తూ పరోక్షంగా ఎంతో మందిని మానసికక్షోభకు గురిచేస్తోందని ఉత్తరాఖండ్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

Facebook : ఉత్తరాఖండ్‌ హైకోర్టులో ‘ఫేస్‌బుక్‌’ పై పిటిషన్

Facebook

Petition on Facebook : సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌కు భారత్‌లో భారీ షాక్‌ తగిలింది. న్యూడిటీని, ఫేక్‌ అశ్లీల వీడియోలను ప్రమోట్‌ చేస్తూ పరోక్షంగా ఎంతో మందిని మానసిక క్షోభకు గురి చేస్తోందని ఆరోపిస్తూ ఓ బాధితుడు ఉత్తరాఖండ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశాడు. ఈ పిల్‌ ఆధారంగా ఫేస్‌బుక్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఫేస్‌బుక్‌ ఐడీలను హ్యాక్‌ చేయడంతో పాటు ఫేక్‌ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ ద్వారా ఇతర యూజర్ల ఫొటోలు, వీడియోల్ని సంపాదిస్తున్నారని.. వాటి సాయంతో అశ్లీల కంటెంట్‌ తయారు చేస్తున్నారని ఉత్తరాఖండ్‌కు చెందిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అలాంటి వీడియో ఒకటి తన దాకా వచ్చిందని బాధితుడు తెలిపాడు. భారీ ఎత్తున్న సొమ్ము కోసం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారంటూ వాపోయాడు. ఈ విషయంపై హరిద్వారా ఎస్‌ఎస్‌పీ, డీజీపీలతో పాటు హోం సెక్రటరీకి సైతం ఫిర్యాదు చేశాడు.

PM Jecinda Shock : ప్రధాని ప్రెస్‌మీట్‌లో రొమాన్స్ ప్రశ్న..షాకింగ్ రియాక్షన్ వైరల్

అయితే ఆయన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆర్టీఐ చట్టం ద్వారా స్టేటస్‌ కోసం ప్రయత్నించగా.. తనలాంటి 45 ఫిర్యాదులు ఉన్నాయని గుర్తించారు. దీంతో వాటి ఆధారంగా ఉత్తరాఖండ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశాడు. చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అలోక్‌ కుమార్‌ వర్మ్‌ల బెంచ్ ఈ వాజ్యంపై విచారణ చేపట్టింది. బాధితుడి వాదనలు విన్న కోర్టు.. ఫేస్‌బుక్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ పిల్‌పై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాకుండా ఉత్తరాఖండ్‌ డీజీపీ, హరిద్వార్‌ అదనపు ఎస్పీలకు బెంచ్‌ నోటీసులు పంపింది. కొత్త ఐటీ చట్టాల నేపథ్యంలో అశ్లీల కంటెంట్‌ కట్టడి, యూజర్‌ ప్రైవసీని పరిరక్షించే విషయంలో ట్విటర్‌, ఫేస్‌బుక్‌లు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందంటూ బెంచ్ వాదనల సందర్భంగా వ్యాఖ్యానించడం విశేషం.