Mumbai: మీకెందుకు అన్ని సెలవులంటూ ఏకంగా కోర్టునే నిలదీసిన పిటిషనర్

పిటిషనర్ తరపు న్యాయవాది మాథ్యూస్ నెడుంపర మాట్లాడుతూ, న్యాయవాదులు సెలవులు తీసుకోవడం పట్ల పిటిషనర్‌కు అభ్యంతరం లేదన్నారు. కానీ న్యాయ వ్యవస్థలోని సభ్యులు అదే సమయంలో సెలవులు తీసుకోకూడదని మాత్రమే చెప్తున్నారన్నారు. సంవత్సరం పొడవునా న్యాయస్థానాలు పని చేసే విధంగా ఉండాలని కోరుతున్నారని చెప్పారు

Mumbai: మీకెందుకు అన్ని సెలవులంటూ ఏకంగా కోర్టునే నిలదీసిన పిటిషనర్

Petitioner asked why did the court takes many holidays

Mumbai: న్యాయస్థానాలు సుదీర్ఘ కాలం సెలవులు తీసుకోవడం వల్ల కక్షిదారుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందని ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆరోపించింది. సబీనా లక్డావాలా దాఖలు చేసిన ఈ పిల్‌పై దీపావళి సెలవుల అనంతరం విచారణ జరుపుతామని బోంబే హైకోర్టు ప్రకటించింది. న్యాయస్థానాలు సుదీర్ఘ కాలం సెలవులు తీసుకోవడం వల్ల వ్యాజ్యాల దాఖలు, వాటిపై విచారణ ప్రభావితమవుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు. న్యాయాన్ని కోరేందుకు కక్షిదారులకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని, కోర్టులు సుదీర్ఘ కాలం సెలవులు తీసుకోవడం ఈ హక్కులను ఉల్లంఘించడమేనని ఆరోపించారు.

పిటిషనర్ తరపు న్యాయవాది మాథ్యూస్ నెడుంపర మాట్లాడుతూ, న్యాయవాదులు సెలవులు తీసుకోవడం పట్ల పిటిషనర్‌కు అభ్యంతరం లేదన్నారు. కానీ న్యాయ వ్యవస్థలోని సభ్యులు అదే సమయంలో సెలవులు తీసుకోకూడదని మాత్రమే చెప్తున్నారన్నారు. సంవత్సరం పొడవునా న్యాయస్థానాలు పని చేసే విధంగా ఉండాలని కోరుతున్నారని చెప్పారు. ఈ పిల్‌పై నవంబరు 15న విచారణ జరుపుతామని జస్టిస్ ఎస్‌వీ గంగాపూర్‌వాలా, జస్టిస్ ఆర్ఎన్ లడ్డా డివిజన్ బెంచ్ తెలిపింది. అక్టోబరు 22 నుంచి నవంబరు 9 వరకు హైకోర్టుకు దీపావళి సెలవులు.

Tamil Nadu: అంబులెన్స్‭కు దారి ఇవ్వకపోతే ₹10,000 ఫైన్.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం