Petrol In India : కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే

గత ఐదు రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం పెట్రోల్ పై 50 పైసలు, డీజిల్ పై 55 పైసలు పెంచుతూ...

Petrol In India : కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే

Petrol

Petrol And Diesel Price In India : గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. 15 రోజులకు ఒకసారి ఇంధన ధరల్లో మార్పులు జరుగుతుంటాయనే సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.. కేంద్రం తగ్గింపుతో పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 11 రూపాయల మేర ధరలు దిగి వచ్చాయి. ఎలాంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. గత ఐదు రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 2022, మార్చి 27వ తేదీ ఆదివారం పెట్రోల్ పై 50 పైసలు, డీజిల్ పై 55 పైసలు పెంచుతూ చమురు విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ధరల పెంపు అనంతరం లీటర్ పెట్రోల్ దేశంలో రూ. 3.70, డీజిల్ రూ. 3.75 వరకు పెరిగింది. మార్చి 22వ తేదీ నుంచి ధరలు కంటిన్యూగా పెరుగుతూ వస్తున్నాయి.

Read More : Petrol Diesel Prices : దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో నాలుగోసారి

తెలుగు రాష్ట్రాల్లో ధరలు : –
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.37గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 98.69గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.24గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.56గా ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 112.15గా ఉండగా.. డీజిల్ ధర రూ. 98.47గా ఉంది.
మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.51గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.76గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.58 ఉండగా.. డీజిల్ ధర రూ.98.89గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 112. 06పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.39గా ఉంది.

Read More : Petrol Diesel Prices : దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఆంధ్రప్రదేశ్ : –
అనంతపురంలో లీటర్ పెట్రోల్ రూ.115.01 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.93 లకు లభిస్తోంది.
చిత్తూరులో లీటర్ పెట్రోల్ రూ.115.02 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.89 లకు లభిస్తోంది.
కడపలో లీటర్ పెట్రోల్ రూ.113.99 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.96లకు లభిస్తోంది.
ఈస్ట్ గోదావరిలో లీటర్ పెట్రోల్ రూ.114.06 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.03 లకు లభిస్తోంది.
గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.114.51 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.46 లకు లభిస్తోంది.
కృష్ణాలో లీటర్ పెట్రోల్ రూ.114.28 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.22లకు లభిస్తోంది.
కర్నూలులో లీటర్ పెట్రోల్ రూ.114.50 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.73 లకు లభిస్తోంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.114.51 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు లభిస్తోంది.
విశాఖపట్టణంలో లీటర్ పెట్రోల్ రూ.109.36 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.47 లకు లభిస్తోంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ రూ.110.84 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.84 లకు లభిస్తోంది.
వెస్ట్ గోదావరిలో లీటర్ పెట్రోల్ రూ.110.78కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.82 లకు లభిస్తోంది.

Read More : Petrol Price Hike: పెట్రోల్ ధరల పెంపు: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎటాక్

ఇతర నగరాలు :-
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.11 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90.42 లకు లభిస్తోంది.
కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.53గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 93.57 లకు లభిస్తోంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.00గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.10 లకు లభిస్తోంది.
గుర్ గావ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.99.57గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90.85 లకు లభిస్తోంది.
నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.98గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90.57 లకు లభిస్తోంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.46గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.67 లకు లభిస్తోంది.
భువనేశ్వర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.72 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.58 లకు లభిస్తోంది.