Petrol Diesel Price : ఏ నగరంలో పెట్రోల్ రేటు ఎంత?

గత 28 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా అయితే 15 రోజులకు ఒకసారి ఇంధన ధరల్లో మార్పులు జరుగుతాయి. కానీ 28 రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Petrol Diesel Price : ఏ నగరంలో పెట్రోల్ రేటు ఎంత?

Petrol Diesel Price

Petrol Diesel Price : గత 28 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా అయితే 15 రోజులకు ఒకసారి ఇంధన ధరల్లో మార్పులు జరుగుతాయి. కానీ 28 రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100కు పైనే ఉంది. ఆగస్టు చివరి నాటికి పెట్రోల్ పై రెండు నుంచి మూడు రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్న పేద మధ్యతరగతి వర్గాలపై ఈ భారం పడుతూనే ఉంది. రేట్లు అధికంగా ఉండటమే దీనికి కారణం. మరోవైపు ప్రైవేట్ ప్రజా రవాణా వాహనదారులు డీజిల్ ధరలను సాకుగా చూపుతూ చార్జీలు పెంచేశారు. ఈ ప్రభావం పేద ప్రజలపై అధికంగా పడుతుంది

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను ఓ సారి పరిశీలిద్దాం.

తెలంగాణ

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.93.. లీటర్ డీజిల్ ధర రూ. 98.10గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.83గా ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.89గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.89గా ఉంది.
మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.51గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.59గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83ఉండగా.. డీజిల్ ధర రూ.97.96గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.53గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌

గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.21 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.78లకు లభిస్తోంది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.02 ఉండగా.. డీజిల్ ధర రూ. 98.63గా ఉంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.92 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.49 లకు లభిస్తోంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.37లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.98.96గా ఉంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87 లకు లభిస్తోంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది.
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా.. డీజిల్ ధర రూ.94.39గా ఉంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.26 గా ఉంది.
లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.83 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.18గా ఉంది.