Petrol And Diesel Prices : తగ్గేదేలే…అక్టోబర్ లో 20 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. గత కొంతకాలంగా వరుసగా చమురు ధరలు పెరుగుతూనేవున్నాయి. రెండు రోజుల విరామం తరువాత చమురు ధరలు మళ్ళీ పెరిగాయి.

Petrol And Diesel Prices : తగ్గేదేలే…అక్టోబర్ లో 20 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol

petrol and diesel prices hike : దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. గత కొంతకాలంగా వరుసగా చమురు ధరలు పెరుగుతూనేవున్నాయి. రెండు రోజుల విరామం తరువాత చమురు ధరలు మళ్ళీ పెరిగాయి. దేశవ్యాప్తంగా చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. లీటరు పెట్రోల్ పై 36 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 58 పైసలు పెంపు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 107.94, డీజిల్ రూ. 96.67కు చేరింది.

ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 113.80, డీజిల్ రూ.104.75కు పెరిగింది. చెన్నై లో లీటర్ పెట్రోల్ రూ. 104.78,డీజిల్ రూ.100.89కు చేరింది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ. 108.41, డీజిల్ రూ.99.75కు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.112.27 డీజిల్ రూ.105.46కు పెరిగింది.

Covid 19 Vaccine : రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భేటి

అక్టోబర్ నెలలో 20 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు అక్టోబర్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు 6 రూపాయలకు పైగా పెరిగాయి. దేశంలో 12 రాష్ట్రాల్లో లీటర్ డీజిల్ ధర 100 దాటింది. కేరళ, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ లేహ్‌లో లీటర్ డీజిల్ ధర 100 దాటింది.

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85 డాలర్ల కు చేరింది. సెప్టెంబర్ నెల నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 9-10 డాలర్లు పెరిగింది.