Today Petrol Price : పెట్రోల్ రేట్లలో ఎటువంటి మార్పు లేదు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా!

దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే కొన్ని నగరాల్లో పెట్రోల్ రేట్లు 100 తక్కువ ఉండగా.. మరికొన్ని చోట్ల సెంచరీకి పైనే ఉంది

Today Petrol Price : పెట్రోల్ రేట్లలో ఎటువంటి మార్పు లేదు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా!

Petrol

Today Petrol Price :  పెట్రోల్ ధరలు ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా కేంద్రం ఫ్యూయల్‌పై సుంకం తగ్గించడంతో కొద్దిగా ఉపశమనం కలిగింది. కేంద్రం బాటలోనే కొన్ని రాష్ట్రాలు పయనించడంతో మరింత తగ్గాయి ఫ్యూయల్ ధరలు. అయితే కొన్ని రాష్ట్రాలు తగ్గించలేదు.. దీంతో ఆయా రాష్ట్రాల ప్రజలపై భారం పడుతుంది. కేంద్రం బాటలోనే మిగతా రాష్ట్రాలు కూడా సుంకం తగ్గిస్తే తమపై భారం తగ్గుతుందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఫ్యూయల్ ధరల ప్రభావం అనేక రంగాలపై పడుతుంది. రవాణా రంగంపై దీని ప్రభావం అధికంగా ఉంది. దీంతో చార్జీలు పెంచేస్తున్నారు. అయితే మంగళవారం (డిసెంబర్‌ 14) దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు నిలకడగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడిచముర ధరలు పెరుగుతుండడంతో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు.

చదవండి : Petrol And Diesel Price : పెట్రో ధరల్లో స్వల్ప తేడాలు..ఏ నగరంలో ఎంత ?

ఢిల్లీలో పెట్రోల్ లీటరు ధర రూ.95.41 ఉండగా,డీజిల్ లీటరు రూ. 86.67 ఉంది.
ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ.109.98. డీజిల్ లీటరుకు రూ. 94.14.
కోల్‌కతాలో పెట్రోల్ లీటరుకు రూ.104.67 ఉండగా, డీజిల్ లీటరుకు రూ.89.79.
చెన్నైలో పెట్రోల్ – లీటరుకు రూ. 101.40; డీజిల్ – లీటరుకు ₹91.43
నోయిడాలో పెట్రోల్ లీటరు ధర రూ. 95.51 ఉండగా, డీజిల్ లీటరు రూ.87.01 ఉంది.
భోపాల్‌లో పెట్రోల్ లీటరు ధర రూ.107.23 ఉండగా,డీజిల్ లీటరు రూ.90.87
బెంగళూరులో పెట్రోల్ లీటరు ధర రూ.100.58 ఉండగా,డీజిల్ లీటరు రూ.85.01 ఉంది.

చదవండి : Petrol Price India : కనికరం చూపుతున్న పెట్రోల్ ధరలు.. ఏ నగరంలో ఎంత ?

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా, లీటర్ డీజిల్ రూ.94.62గా ఉంది.
కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధ ర రూ.108.38గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.79గా ఉంది.
వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ. 107.69 ఉండగా, డీజిల్ లీటర్ రూ.94.14గా ఉంది.

చదవండి : Petrol bunks in space : అంతరిక్షంలో పెట్రోల్‌ బంకులు..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో పెట్రోల్ లీటర్ రూ.110.29 ఉండగా, డీజిల్ ధర రూ.96.36 ఉంది.
విశాఖపట్నంలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.30 ఉండగా, డీజిల్ ధర రూ. 95.41గా ఉంది.
విజయనగరంలో పెట్రోల్ లీటర్ రూ.109.46 ఉండగా, డీజిల్ ధర రూ.95.57గా ఉంది.
కృష్ణా జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ. 109.91గా ఉండగా,. డీజిల్ ధర రూ.96.23గా ఉంది.