Petrol Diesel Rate : జోరు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర?

పెట్రోల్ ధర పెరుగుదలకు బ్రేక్ పడింది. ఈ నెలలో నాలుగు రూపాయలకు పైగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి

Petrol Diesel Rate : జోరు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర?

Petrol Diesel Prices

Petrol Diesel Rate : పెట్రోల్ ధర పెరుగుదలకు బ్రేక్ పడింది. ఈ నెలలో నాలుగు రూపాయలకు పైగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఫ్యూయల్ ధరల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఇక ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లీటర్ పెట్రోల్ సెంచరీ దాటింది. ఇక డీజిల్ కూడా అదే బాటలో పయనిస్తుంది. చాలా రాష్ట్రాల్లో డీజిల్ రేట్లు కూడా సెంచరీ దాటాయి. ఫ్యూయల్ రేట్ల పెరుగుదల అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లోని డీజిల్, పెట్రోల్ ధరలను ఓసారి చూద్దాం.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 94.57 లకు లభిస్తోంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.77కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.52 ఉంది.
లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.83 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.02గా ఉంది.
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.43 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 97.68 గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 103.16 ఉండగా.. డీజిల్ ధర రూ.9907గా ఉంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.109.53 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.100.37గా ఉంది.

చదవండి : Petrol Diesel Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? వేగంగా కేంద్రం అడుగులు!

తెలుగురాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.09గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 103.18గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.103.45గా ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 110.42గా ఉండగా.. డీజిల్ ధర రూ. 103.46గా ఉంది.
మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.38గా ఉండగా.. డీజిల్ ధర రూ.103.44గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.09 ఉండగా.. డీజిల్ ధర రూ.103.18గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.61పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.102.71గా ఉంది.

చదవండి : Petrol Rate Today : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. హైదరాబాద్‌లో లీటర్ రూ. 110

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.112.49 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.96 లకు లభిస్తోంది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.111.47 ఉండగా.. డీజిల్ ధర రూ. 103.94గా ఉంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.34లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.104.01గా ఉంది.
కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.79గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.31గా ఉంది.
గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 112.49 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.104.96లకు లభిస్తోంది.