Petrol Diesel Prices Cut : వాహనదారులకు రిలీఫ్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

చమురు సంస్థలు వాహనదారులకు కాస్త ఊరటనిచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 40పైసలు తగ్గించాయి.

Petrol Diesel Prices Cut : వాహనదారులకు రిలీఫ్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Prices Cut : చమురు సంస్థలు వాహనదారులకు కాస్త ఊరటనిచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 40పైసలు తగ్గించాయి. ఈ తగ్గింపు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానుంది. సోమవారం వరకు పలు నగరాల్లో పెట్రోల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర Rs 106.31గా ఉంది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03గా ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 102.63గా ఉంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గాయి. ఆ తర్వాత స్థిరంగా ఉననాయి. దీంతో చమురు కంపెనీలు ఇంధన ధరలు తగ్గించాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లకు దిగువన ఉంది. కాగా, మార్చిలో క్రూడాయిల్ బ్యారెల్ ధరలు భగ్గుమన్నాయి. మార్చిలో క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 139 డాలర్లు పలికింది. 2008 తర్వాత ఇదే అత్యధికం. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి.

ఆరు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి. ఈ ఏడాదిలో చివరిసారిగా ఏప్రిల్ 7 ఇంధన ధరలు తగ్గించారు. ఆ తర్వాత ధరలు తగ్గించడం ఇదే.