Petrol Diesel Prices : సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

సామాన్యులకు ఇంధన ధరలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. అసలే ఆకాశాన్ని తాకిన ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. పెరిగిన ధరలతో బతుకు బండి నడిపేది ఎలాగో తెలియక అవస్థలు పడుతున్నాడు.

Petrol Diesel Prices : సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Petrol Diesel Prices

Petrol Diesel Prices : సామాన్యులకు ఇంధన ధరలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. అసలే ఆకాశాన్ని తాకిన ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. పెరిగిన ధరలతో బతుకు బండి నడిపేది ఎలాగో తెలియక అవస్థలు పడుతున్నాడు. ఇది చాలదన్నట్టు.. కామన్ మ్యాన్ కి మరో షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి.

కొన్ని రోజుల క్రితం వరకు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ పై 26 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.105.74కు చేరింది. డీజిల్ పై 32 పైసలు పెరిగింది. దీంతో లీటర్ డీజిల్ ధర సెంచరీకి చేరువగా రూ.98.06కు ఎగసింది.

Pension : పెన్షన్లరకు అలర్ట్.. వెంటనే ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేయండి.. లేదంటే పెన్షన్ రాదు

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలను, రూపాయి-డాలర్ మారకపు విలువను పరిగణనలోకి తీసుకుని ప్రతిరోజూ ఇంధన రేట్లను సవరిస్తాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి ధరలు మార్పులు చేస్తారు.

పలు నగరాల్లో ఇంధన ధరలు..
నగరం పెట్రోల్ ధర లీటర్ డీజిల్ ధర లీటర్
హైదరాబాద్ రూ.105.74 రూ.98.06
ఢిల్లీ రూ.101.64 రూ.89.87
ముంబై రూ.107.71 రూ.97.52
చెన్నై రూ.99.36 రూ.94.45
కోల్ కతా రూ.102.17 రూ.92.97

Caffeine : టీ,కాఫీలలో ఉండే కెఫిన్ వల్ల ఆరోగ్యానికి నష్టమా?..లాభమా?..

కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.46 శాతం తగ్గుదలతో 77.73 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.28 శాతం క్షీణతతో 74.61 డాలర్లకు తగ్గింది. అక్కడ చమురు ధరలు తగ్గుతున్నా మన దేశంలో మాత్రం ధరల మోత ఆగడం లేదు.