Petrol Diesel Price: ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవీ

ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్-డీజిల్ రేట్లను ఈరోజు కూడా మార్చలేదు. చమురు కంపెనీలు వరుసగా 12వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు.

Petrol Diesel Price: ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవీ

Petrol

Petrol Diesel Price: ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్-డీజిల్ రేట్లను ఈరోజు కూడా మార్చలేదు. చమురు కంపెనీలు వరుసగా 12వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల్లో పెరుగుదల కనిపిస్తోండగా.. దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. పెట్రోల్ ధర దాదాపుగా అన్నీ రాష్ట్రాల్లో రూ.100 దాటింది.

పెట్రోల్-డీజిల్ ధరలు(16 నవంబర్ 2021):
హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.108.20గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది.
అమరావతి పెట్రోల్ ధర లీటరు డరూ.110.97 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.96.66గా ఉంది.
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.103.97, డీజిల్ ధర లీటరుకు రూ.86.67గా ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కి చేరుకోగా, డీజిల్ లీటరుకు రూ.94.14గా ఉంది.
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 104.67 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 89.79గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.40, డీజిల్ ధర లీటరు రూ.91.42గా ఉంది.

Gay Judge: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. న్యాయమూర్తిగా ‘గే’!

చమురు ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకోగా.. పెట్రోలు ధరపై 5రూపాయలు, డీజిల్‌పై 10రూపాయల తగ్గింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై విలువ ఆధారిత పన్ను(VAT)ని తగ్గించాయి.

వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు:
కర్ణాటక, పుదుచ్చేరి, జమ్మూ & కాశ్మీర్, సిక్కిం, మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, డామన్ & డయ్యూ, దాద్రా & నాగ్ర్ హవేలీ, చండీగఢ్, అస్సాం, మధ్యప్రదేశ్, త్రిపుర, గుజరాత్, నాగాలాండ్, పంజాబ్, గోవా, మేఘాలయ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అండమాన్ & నికోబార్, లడఖ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా