Petrol, Diesel Prices Today : ఆగని పెట్రో బాదుడు.. గడిచిన 8 రోజుల్లో 7 సార్లు పెరిగిన ఇంధన ధరలు

Petrol, Diesel Prices Today : భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. మంగళవారం (మార్చి 29) కూడా మళ్లీ పెరిగాయి. ఆయిల్ కంపెనీలు సవరించిన ధరలను ప్రకటించాయి.

Petrol, Diesel Prices Today : ఆగని పెట్రో బాదుడు.. గడిచిన 8 రోజుల్లో 7 సార్లు పెరిగిన ఇంధన ధరలు

Petrol Price Hike

Petrol, Diesel Prices Today : భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. మంగళవారం (మార్చి 29) కూడా మళ్లీ పెరిగాయి. ఆయిల్ కంపెనీలు సవరించిన ధరలను ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర తగ్గినా భారతదేశంలో పెట్రో బాదుడు కొనసాగుతోంది. దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులే కారణమని అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతకొన్నిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. లీటర్ పెట్రోల్ పై 90 పైసలు పెరగగా, లీటర్ డీజిల్ పై 76 పైసలు ధర పెరిగింది. గడిచిన 8 రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ. 4.94 పెరగగా, డీజిల్ లీటర్ ధర రూ.4.89 పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.21 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.91.47గా నమోదైంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.61, డీజిల్ ధర రూ.99.83గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.37, డీజిల్ రూ.101.23గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.115.04గా ఉండగా.. డీజిల్ లీటర్ పై రూ. 101.43గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.04, డీజిల్ ధర రూ.99.25గా ఉంది.

Petrol, Diesel Prices Today Fuel Prices Rise Again, Petrol Tops Rs 100 Litre In Delhi. Check Latest Rates (1)

Petrol, Diesel Prices Today Fuel Prices Rise Again, Petrol Tops Rs 100 Litre In Delhi. Check Latest Rates 

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.94గా ఉండగా.. డీజిల్ లీటర్ ధర రూ.96కు పెరిగింది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.68కు పెరగగా, లీటర్ డీజిల్ ధర రూ.94.62కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతోనే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే.. భారత్ విదేశాల నుంచి 85 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది.

దేశవ్యాప్తంగా ఇంధన రేట్లు స్థానిక పన్నులను బట్టి రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. మార్చి 22న రేట్ల సవరణలో నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం ముగిసిన తర్వాత ధరలు పెరగడం ఇది ఏడోసారి. మొదటి నాలుగు సందర్భాల్లో ఇంధన ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి. జూన్ 2017లో రోజువారీ ధరల సవరణను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఒక్క రోజులో అత్యధికంగా పెరిగాయి. ఆదివారం పెట్రోల్ ధర లీటరుకు 50 పైసలు, డీజిల్ ధర 55 పైసలు పెరిగింది. మొత్తం మీద, పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 4.80 డీజిల్ కూడా లీటరుకు రూ.4.80 పెరిగింది.

Read Also : Petrol-Diesel Price : దేశంలో తగ్గని పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏడు రోజుల్లో ఆరోసారి పెంపు..!