Petrol Prices Today: పంజాబ్‌లో భారీగా తగ్గిన పెట్రోల్ ధర.. దేశవ్యాప్తంగా రేట్లు ఇవే!

ఇంధన ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో పెట్రోలు ధరపై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గింపును ప్రభుత్వం ప్రకటించింది.

Petrol Prices Today: పంజాబ్‌లో భారీగా తగ్గిన పెట్రోల్ ధర.. దేశవ్యాప్తంగా రేట్లు ఇవే!

Petrol

Petrol Prices Today: ఇంధన ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో పెట్రోలు ధరపై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గింపును ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై దేశంలోని పలు రాష్ట్రాలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై విలువ ఆధారిత పన్ను(VAT)ని తగ్గించాయి. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత, 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాయి.

పంజాబ్‌లో భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు:
ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు మాత్రం ఇంకా వ్యాట్ తగ్గించలేదు. అనూహ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పాలనలోని రెండు రాష్ట్రాలు.. పంజాబ్, రాజస్థాన్ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పంజాబ్‌లో పెట్రో ధరలపై లీటరుకు రూ.16.02 తగ్గగా.. డీజిల్ ధర లీటరుకు రూ.19.61 తగ్గింది. రాష్ట్రంలో పెట్రోల్‌పై వ్యాట్‌ను రూ.11.02 తగ్గించగా, డీజిల్‌పై రూ.6.77 తగ్గించింది అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పెట్రోలుపై ఈమేర తగ్గింపు జరగలేదని తెలుస్తుంది.

వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు:
కర్ణాటక, పుదుచ్చేరి, జమ్మూ & కాశ్మీర్, సిక్కిం, మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, డామన్ & డయ్యూ, దాద్రా & నాగ్ర్ హవేలీ, చండీగఢ్, అస్సాం, మధ్యప్రదేశ్, త్రిపుర, గుజరాత్, నాగాలాండ్, పంజాబ్, గోవా, మేఘాలయ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అండమాన్ & నికోబార్, లడఖ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా..

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో డీజిల్ ధర గరిష్టంగా రూ.13.43 తగ్గగా.., కర్ణాటకలో లీటరుకు రూ.13.35 తగ్గింది. లడఖ్‌లో డీజిల్‌పై లీటరుకు రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పాటు, వ్యాట్ కూడా లీటరుకు రూ.9.52 తగ్గింది.

లేటెస్ట్ రేట్లు ప్రకారం చూస్తే, హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.108.20గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.62కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధర లీటరు డరూ.110.67 వద్దనే స్థిరంగా ఉండగా.. డీజిల్ ధర రూ.96.08 వద్దనే ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.103.97కి చేరుకోగా.. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 109.98గా ఉంది. కోల్‌కతాలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ.104.67గా ఉంది. చెన్నైలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ.101.40గా ఉంది.