Petrol Price: తగ్గేదే లే.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గుతాయని దేశమంతా భావించినా.. పెట్రోల్, డీజిల్ ధరలు అసలు తగ్గేలా కనిపించట్లేదు.

Petrol Price: తగ్గేదే లే.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Rates

Petrol Price: ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గుతాయని దేశమంతా భావించినా.. పెట్రోల్, డీజిల్ ధరలు అసలు తగ్గేలా కనిపించట్లేదు. రోజురోజుకు పెరగుతూ సామాన్యులకు భారంగా మారతుంది పెట్రోల్. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేసింది ఈ క్రమంలోనే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

అంతకుముందు నాలుగురోజుల పాటు పెరిగిన పెట్రోల్ ధరలు.. రెండు రోజుల విరామం తరువాత మళ్ళీ పెరిగాయి. అక్టోబర్ నెలలో ఇప్పటివరకు 15 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.106.19కి చేరగా, డీజిల్‌ ధర రూ.94.92కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌పై 34 పైసలు పెరిగి రూ.112.11కు, డీజిల్‌పై 37 పైసలు అధికమై రూ.102.89కు చేరాయి.

ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరగగా.. పెట్రోల్ రూ.110.46కు, డీజిల్‌ రూ.103.56కు చేరాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.49కి చేరగా డీజిల్ ధర రూ. 104. 96కి చేరుకుంది.