Petrol Price : వామ్మో.. తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర

రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయారు. వారిపై పై ఇంధన ధరలు మరింత భారం మోపుతున్నాయి. నెల రోజులుగా బ్రేకులు లేకుండా రేట్లు పెరిగిపోతున్నాయి. మే నెలలో 15 సార్లు రేట్లు పెంచాయి చమురు కంపెనీలు. ఒక్క నెలలోనే లీటర్ పెట్రోల్ రేటు సెంచరీ కొట్టింది. దీంతో వాహనదారులు జంకుతున్నారు.

Petrol Price : వామ్మో.. తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర

Petrol Price

Petro Price Reaches Rs.100 : రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయారు. వారిపై పై ఇంధన ధరలు మరింత భారం మోపుతున్నాయి. నెల రోజులుగా బ్రేకులు లేకుండా రేట్లు పెరిగిపోతున్నాయి. మే నెలలో 15 సార్లు రేట్లు పెంచాయి చమురు కంపెనీలు. ఒక్క నెలలోనే లీటర్ పెట్రోల్ రేటు సెంచరీ కొట్టింది. దీంతో వాహనదారులు జంకుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధర భగ్గుమంటోంది. లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలుగా ఉంది. ముంబైలో అయితే లీటర్ ధర వంద పైనే ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93గా, డీజిల్ ధర రూ.84గా ఉంది. వరుసగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు.. వాహనం తియ్యాలంటేనే వణుకుతున్నారు. వీటి ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల రేట్లపైనా ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరగడమే ధరల పెరుగుదలకు కారణం అని ఆయిల్ కంపెనీలు అంటున్నాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల కారణంగా కూడా పెట్రోల్ లీటర్ ధర వందకు చేరిందని విశ్లేషిస్తున్నారు.

తెలంగాణలోని అనేక జిల్లాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ మార్కుకి చేరువ అవుతున్నాయి. 5 జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.99 దాటిపోయింది. పెరుగుతున్న ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లతో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్ లో పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది. లీటర్ ధర రూ.99.65పైసలుగా ఉంది.

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.97.62పైసలుగా ఉంది. నిజామాబాద్, వనపర్తి, కామారెడ్డి, గద్వాల్ జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.99గా ఉంది. డీజిల్ ధరలూ ఇలాగే పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ లో లీటర్ డీజిల్ ధర రూ.94.40పైసలుగా ఉంది. హైదరాబాద్ లో రూ.92.52పైసలుగా ఉంది. ప్రీమియం పెట్రోల్ లీటర్ ధర వారం క్రితమే రూ.100 దాటగా.. ఇప్పుడు సాధారణ పెట్రోల్ సైతం సెంచరీకి దగ్గరలో ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరిగాయని, అందుకు చమురు రేట్లు పెంచుతున్నామని ఆయిల్ కంపెనీలు అంటున్నాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో పెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గింది. అయినా, ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించకపోవడమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.