IIT Kanpur : హ్యాట్సాఫ్.. పెట్రోల్ బంకు వర్కర్ కూతురు, ఐఐటీ కాలేజీలో సీటు సాధించింది

పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. పేదరికం కూడా లక్ష్యాన్ని అడ్డుకోలేదు. ఇది అనేక సార్లు ప్రూవ్ అయ్యింది. తాజాగా, పట్టుదలతో చదివి ఓ పేద కుటుంబానికి చెందిన యువతి అద్భుతాన్ని

IIT Kanpur : హ్యాట్సాఫ్.. పెట్రోల్ బంకు వర్కర్ కూతురు, ఐఐటీ కాలేజీలో సీటు సాధించింది

Iit Kanpur

IIT Kanpur : పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. పేదరికం కూడా లక్ష్యాన్ని అడ్డుకోలేదు. ఇది అనేక సార్లు ప్రూవ్ అయ్యింది. తాజాగా, పట్టుదలతో చదివి ఓ పేద కుటుంబానికి చెందిన యువతి అద్భుతాన్ని సాధించింది. ఏకంగా ప్రతిష్టాత్మక ఐఐటీ కాలేజీలో సీటు సంపాదించింది.

ఆమె తండ్రేమో పెట్రోల్ బంక్‌లో వ‌ర్క‌ర్. త‌ల్లేమో బ‌జాజ్ మోటార్స్‌లో వ‌ర్క‌ర్. కానీ ఆ దంప‌తుల కూతురు తన‌కున్న అడ్డంకుల‌ను అధిగ‌మించి ఐఐటీ కాన్పూర్‌లో సీటు సాధించి అందరికీ ఆద‌ర్శంగా నిలిచింది.

Flipkart: మళ్లీ అవకాశం రాకపోవచ్చు.. ఫ్లిప్ కార్ట్‌లో రూ.10వేల లోపు టాప్-5 ఫోన్‌లు ఇవే!

ఆయన పేరు రాజగోపాలన్. కేర‌ళ‌లోని క‌న్నూరు జిల్లా ప‌య్య‌నూరులోని ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ పెట్రోల్ బంక్‌లో వర్క‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఆయన భార్య శోభ‌న స్థానికంగా ఉన్న బ‌జాజ్ మోటార్స్‌లో వ‌ర్క‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. వారిది పేద కుటుంబం. ఎన్నో ఆర్థిక సమస్యలు. తల్లిదండ్రులు కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది. అలాంటి దంపతులకు పుట్టిన బిడ్డ ఆర్య కష్టపడి చదువుకుంది. ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి బీటెక్ పూర్తి చేసింది. ఏకంగా ఐఐటీ కాన్పూర్‌లో ఎంటెక్(పెట్రో కెమిక‌ల్ ఇంజినీరింగ్) సీటు సాధించింది.

Air Conditioners : ఏసీల వినియోగం ఆరోగ్యానికి లాభమా…నష్టమా?..

ఈ విష‌యాన్ని ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ శ్రీకాంత్ మాధ‌వ్ వైద్య త‌న ట్విట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ వ‌ర్క‌ర్ రాజ‌గోపాలన్ కుమార్తె ఆర్య స్ఫూర్తిదాయ‌క‌మైన స్టోరీని మీతో పంచుకుంటున్నాను. ఐఐటీ కాన్పూర్‌లో ఆర్య సీటు సాధించ‌డం సంతోషంగా ఉందన్నారు శ్రీకాంత్ వైద్య. ఈ ట్వీట్ కు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ఆర్య‌కు ట్విట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు. చిన్నప్పటి నుంచి తండ్రి కష్టాన్ని చూస్తూ చదువుకున్న ఆర్య ఈరోజు తన తండ్రి గర్వపడే స్థాయికి ఎదిగింది. ఎంతోమంది కలలు కనే ఐఐటీ కాలేజీలో సీటు సాధించి శభాష్ అనిపించుకుంది.

ఈ రోజుల్లో తల్లిదండ్రులు సకల సౌకర్యాలు కల్పించినా చదువుకోని పిల్లలున్న రోజులివి. అలాంటిది.. డబ్బు లేకపోయినా, సౌకర్యాలు లేకున్నా, ఇబ్బందులు వెంటాడుతున్నా.. అన్నింటిని అధిగమించి ఆ అమ్మాయి కష్టపడి చదువుకుంది. ప్రతిష్టాత్మక కాలేజీలో సీటు సాధించి లక్ష్యం దిశగా సాగిపోతోంది.