షెల్ఫ్ టూ హెల్ప్ : వరద బాధితులకు తల్లీ కొడుకుల చేయూత 

  • Published By: veegamteam ,Published On : August 23, 2019 / 05:13 AM IST
షెల్ఫ్ టూ హెల్ప్ : వరద బాధితులకు తల్లీ కొడుకుల చేయూత 

కర్ణాటక రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. ఇప్పుడిప్పుడే వరద కష్టాల నుంచి కోలుకుంటున్నారు. ఇల్లు కూలిపోయినవారు..వాటిని నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నారు. బాధితుల కోసం తమ వంతు సహాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో శివమొగ్గ జిల్లాలో  పెట్రోల్ పంప్ యజమాని అవినాష్..అతని తల్లి నవరత్న ‘పీపుల్స్ వాల్’ పేరుతో ఓ షెఫ్ ను ఏర్పాటు చేశారు. దాంట్లో ఆహారంతో పాటు బట్టలు, రొట్టెలు, నిత్యావసర వస్తువులన్ని ఉంచారు. ఇక్కడకు వచ్చి ఎవరికి కావాల్సివి వారు పట్టుకెళ్లమని విజ్నప్తి చేశారు. 

ఈ పీపుల్స్ వాల్ కు మంచి స్పందిన వస్తుండటంతో తల్లీ కొడుకులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. బాధితులకు సహాయం అందించాలనే తమ ఉద్ధేశం నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందంటున్నారు. బాధల్లో ఉన్నవారిని ఆదుకోవటంలో సంతృప్తి ఉంటుందంటున్నారు. 

కాగా నవరత్న మాట్లాడుతూ..తన ఫ్రెండ్ సవితా కుమార్ జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తు బాధితులకు నేరుగా సహాయసహకారాల్ని అందిస్తున్నారనీ..తాను కూడా ఏదైనా చేయాలని ఆలోచన ఉంది కానీ ఎలా చేయాలో తెలీక ఈ ఆలోచన వచ్చి పీపుల్స్ వాల్ ను ఏర్పాటుచేశామని తెలిపారు. వరద బాధల్లోకి ఇప్పుడిప్పుడే నెమ్మది కోలుకుంటున్నవారిని ప్రధానంగా కావాల్సినవి బట్టలు, ఆహారం, నిత్యావసర వస్తువులే కాబట్టి పీపుల్స్ వాల్ షెల్ఫ్ లో వాటిని అందుబాటులో ఉంచామని తెలిపారు.

పీపుల్స్ షెల్ప్ తో సహాయం అందుకున్న ఓ బాధితుడు మాట్లాడుతూ..వరదల్లో తాము అంతా కోల్పోయామని తమ చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రస్తుతం తినటానికి తిండి కూడా లేని దుస్థితిలో ఉన్నామనీ అప్పుడు తమకు ఈ పీపుల్స్ వాల్ షెల్ఫ్ గురించి తెలిసి ఇక్కడికి వచ్చి తమకు కావాల్సింది పట్టుకెళుతున్నామనీ..మాలాంటివారికోసం వీరు చేస్తున్న ఈ మంచి పనికి ధన్యవాదాలు అని తెలిపాడు.