Petrol Rate: పెట్రోల్ @103.. మాటల్లేవ్

Petrol Rate: పెట్రోల్ @103.. మాటల్లేవ్

Petrol Rate Hiked Upto Rs 103

Petrol Rate: కాలభైరవుడు ఒకేసారి వంద మందిని నరుకుతాడో లేదో తెలియదు గానీ, సామాన్యుడి వంద నోటు మాత్రం లీటర్ పెట్రోల్ కు ఖతం అవ్వాల్సిందే. అసలే కరోనా లాక్ డౌన్ తర్వాత రోడ్డెక్కిన ప్రజానీకానికి పెట్రోల్ ధరలు పెరిగి చుక్కలు చూపిస్తున్నాయి. వందకు అటుఇటుగా తొణికిసలాడిన పెట్రోల్ ధర ఏకంగా 103కు పైగా పాకింది. ఇక వంద స్థానానికి చేరేందుకు రెడీగా ఉంది డీజిల్ ధర రూ.97.40తో.

హైదరాబాద్ తో పాటు దేశ వ్యాప్తంగా పెరిగిన ఇందన ధరలు.. సామాన్యుడి జేబుకు చిల్లుకు పెడుతున్న ఇందన ధరల నుంచి కాపాడుకోవడానికి ప్రత్యామ్న్యాయం గురించి ఆలోచిస్తున్నారు. పెట్రోల్‌పై 35పైసలు, డీజిల్ పై 18పైసలు పెరిగిన తర్వాత ప్రాంతాల వారీగా ఇందన ధరల వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీ – పెట్రోల్ రూ. 99.51, డీజిల్ రూ. 89.36

హైదరాబాద్‌ – పెట్రోల్ రూ. 103.41, డీజిల్ రూ. 97.40

ముంబై – పెట్రోల్ రూ. 105.62, డీజిల్ రూ. 96.95

కోల్‌కతా – పెట్రోలు రూ.99.45, డీజిల్ రూ. 92.27

చెన్నై – పెట్రోలు రూ.100.44, డీజిల్ రూ. 93.91

ఇలా ఏపీ, తెలంగాణతో పాటుగా 12రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో 100దాటేసింది పెట్రోల్. ఇలా పెట్రలో ధర పెరుగుతూ రావడం మే నెల నుంచి ఇది 34వ సారి. మొత్తం పెరిగిన ధరలను బట్టి చూస్తే పెట్రోల్‌పై రూ.9.11, డీజిల్‌పై రూ. 8.63 పెరిగినట్లు తెలుస్తుంది. ఏడాదిన్నర కాలంగా పెట్రోల్ లీటరుకు సుమారు 31 రూపాయలు వరకూ పెరగ్గా.. డీజిల్ ధర 27 రూపాయలకు పెరిగింది.