రిటైర్ అయిన తర్వాత పీఎఫ్ అకౌంట్‌ పని చేయదు!

  • Published By: madhu ,Published On : August 24, 2020 / 08:16 AM IST
రిటైర్ అయిన తర్వాత పీఎఫ్ అకౌంట్‌ పని చేయదు!

ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసీలెనీయ‌స్ ప్రొవిజ‌న్స్ యాక్టు 1952 కింద ఉద్యోగ భ‌విష్య నిధి(ఈపీఎఫ్) ఉంటుంది. ఈపీఎఫ్ ప‌థ‌కం లో ఉద్యోగి కొంత శాతం చెల్లించ‌గా కొంత మొత్తాన్ని సంస్థ‌లు చెల్లిస్తాయి. అయితే ఈ ఈపీఎఫ్‌ను రిటైర్మెంట్ తర్వాత కూడా వడ్డీ వస్తుందని అందులోనే ఉంచుకునేవారు కొందరు ఉన్నారు.


అయితే 55ఏళ్లకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత Indian PF law ప్రకారం..పీఎఫ్ ఖాతా పని చేయదని అధికారులు చెబుతున్నారు. ఓ ఉద్యోగి 55 సంవత్సరాల తర్వాత రిటైర్ అయినా, పర్మినెంట్ గా విదేశాలకు వెళ్లినా, మరణించినా..36 నెలలోపు నగదు మొత్తం డ్రా చేసుకొనేందుకు దరఖాస్తు చేసుకోకపోతే…వడ్డీ వర్తించదని ఈపీఎఫ్ఓ వెల్లడించింది.

రిటైర్మెంట్ అయినా, లేదా ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం కూడా పలువురు ఉద్యోగులు వారి ఈపీఎఫ్ ఖాతాలను కొనసాగిస్తూ..దానికి వడ్డీని పొందుతున్నారు. కొంతమంది ఈపీఎఫ్ మొత్తాన్ని డ్రా చేయడంలో ఆలస్యం చేస్తుంటారు. ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్లను నిలిపివేసిన వారికి 2011 నుంచి 3 సంవత్సరాలు లేదా..36 నెలల ఖాతా నిర్వహించని వారికి వడ్డీ చెల్లించదు.



పదవీ విరమణకు ముందు వచ్చిన నిధిపై వచ్చిన వడ్డీకి (పదవి విరమణ, విత్ డ్రా చేసుకున్న, చేసుకోకపోయినా) ఎలాంటి పన్ను వర్తించదు. 2016లో ఈ నియమాన్ని సవరించింది. నిర్వాహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారునికి 58 సంవత్సరాలు వచ్చే వరకు ఖాతాలో ఉన్న మొత్తంపై వడ్డీ చెల్లిస్తుంది. అయితే..ఇక్కడ ఖాతాదారుడు పదవీ విరమణ తర్వాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ పై వడ్డీ చెల్లించదు.