Popular Front of India: భారత్‌లో పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా ట్విటర్ ఖాతా నిలిపివేత

పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా (పీఎఫ్ఐ) ట్విటర్ ఖాతా నిలిచిపోయింది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పీఎఫ్ఐ ట్విటర్ ఖాతాను నిలిపేసిన ట్విటర్ సంస్థ వివరాలు తెలిపింది. ‘చట్టపరమైన డిమాండ్ నేపథ్యంలో భారత్ లో పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా ట్విటర్ ఖాతా నిలిపివేస్తున్నాం’ అని పేర్కొంది.

Popular Front of India: భారత్‌లో పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా ట్విటర్ ఖాతా నిలిపివేత

Ban On Popular Front of India

Popular Front of India: పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా (పీఎఫ్ఐ) ట్విటర్ ఖాతా నిలిచిపోయింది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పీఎఫ్ఐ ట్విటర్ ఖాతాను నిలిపేసిన ట్విటర్ సంస్థ వివరాలు తెలిపింది. ‘చట్టపరమైన డిమాండ్ నేపథ్యంలో భారత్ లో పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా ట్విటర్ ఖాతా నిలిపివేస్తున్నాం’ అని పేర్కొంది. కాగా, ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, ఐఎస్ఐఎస్, అల్‌ఖైదాల్లో దేశ యువత చేరేలా పీఎఫ్ఐ వారిని తప్పుదారి పట్టిస్తోందని ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది.

“నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”.. https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

పీఎఫ్ఐ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో దానిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ చెప్పింది. పీఎఫ్‌ఐ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) కొన్ని రోజులుగా దాడులు జరుపుతోన్న విషయం తెలిసిందే. పీఎఫ్ఐపై చర్యలు తీసుకుంటుండడంతో పలు ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళనలకూ దిగారు. మరోవైపు, పీఎఫ్ఐపై నిషేధం విధించిన నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కూడా నిషేధం విధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

Mamata Banerjee plays ‘dhaank’: హుషారుగా ఢంకా మోగించిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్