Lancet Study : ఆ వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో 6 వారాల్లోనే క్షీణిస్తున్న యాంటీబాడీలు

ఫైజర్, ఆస్ట్రాజెనెకా కంపెనీలు అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న6 వారాల తర్వాత యాంటీబాడీల క్షీణత ప్రారంభమవుతోందని, 10 వారాల్లోనే ఇవి 50 శాతానికిపైగా తగ్గిపోతాయని తాజా అధ్యయనం తెలిపింది.

Lancet Study : ఆ వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో 6 వారాల్లోనే క్షీణిస్తున్న యాంటీబాడీలు

Vaccine5

Lancet Study ఫైజర్, ఆస్ట్రాజెనెకా కంపెనీలు అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న6 వారాల తర్వాత యాంటీబాడీల క్షీణత ప్రారంభమవుతోందని, 10 వారాల్లోనే ఇవి 50 శాతానికిపైగా తగ్గిపోతాయని తాజా అధ్యయనం తెలిపింది. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌(UCL)కి చెందిన పరిశోధకులు చేసిన ఈ అధ్యయన ఫలితాలను లాన్సెంట్ జర్నల్‌ లో పబ్లిష్ చేశారు. అధ్యయనంలో భాగంగా 18 ఏళ్లు నిండిన 600 మందిని పరిశీలించారు.

ఫైజర్ యాంటీబాడీలు 21-41 రోజుల్లో 7506 యూనిట్స్ ఫర్ మిల్లీలీటర్ ఉండగా, 70 లేదా అంతకంటే ఎక్కువ రోజులకు 3,320 యూనిట్స్ ఫర్ మిల్లీ లీటర్‌గా ఉన్నాయి. ఆస్ట్రాజెనెకా విషయానికి వస్తే… 0-20 రోజుల్లో 1201 యూనిట్స్ ఫర్ మిల్లీలీటర్‌గా..70 లేదా అంతకంటే ఎక్కువ రోజులకు 190 యూనిట్స్ ఫర్ మిల్లీ లీటర్ ఉన్నాయని అధ్యయనంలో తెలిపారు. అయితే యాంటీబాడీ స్థాయిలు ఇదే రేటుతో క్షీణిస్తే ముఖ్యంగా కొత్త వేరియంట్‌లకు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ ల ప్రభావం ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాక్సిన్ తీసుకున్నవారిలో బూస్టర్ డోస్‌ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని గురించిఆలోచించినప్పుడు ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా టీకా అతి తక్కువ యాంటీబాడీల స్థాయిని కలిగి ఉందని మా డేటా సూచిస్తుంది అని అధ్యయనంలో పాల్గొన్న రోబ్ అలడ్రింగ్ అన్నారు.

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్నవారిలో కంటే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో యాంటీబాడీ స్థాయిలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం గుర్తించింది. అంతేకాదు, వైరస్ బారినపడి కోలుకున్న బాధితుల కంటే వ్యాక్సిన్ వేసుకున్నవారిలోనే యాంటీబాడీలు స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆస్ట్రాజెనెకా లేదా ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్నవారిలో యాంటీబాడీ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి.. కోవిడ్-19 నుంచి రక్షణ కల్పించడంలో ఇది ముఖ్యమైన భాగం కావచ్చు.. ఏదిఏమైనా ఈ యాంటీబాడీలు వ్యాక్సిన్ తీసుకున్న రెండు మూడు నెలల్లో గణనీయంగా తగ్గిపోత్తున్నట్టు గుర్తించామని యూనిర్సిటీ కాలేజ్ లండన్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ శాస్త్రవేత్త మధుమిత శ్రోత్రి అన్నారు. క్షీణిస్తున్న యాంటీబాడీ స్థాయిల క్లినికల్ ప్రయోగాలపై ఇంకా స్పష్టత లేనప్పటికీ కొంత క్షీణత ఉందనే అంచనాకు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత టీకాలు కరోనా వైరస్‌పై సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.