ఫైజర్ కరోనా వ్యాక్సిన్: మూడు వారాల్లో రెండు షాట్లు కావాలి.. పంపీణీ కష్టమే.. ఖర్చు కూడా ఎక్కువే!

  • Published By: vamsi ,Published On : November 11, 2020 / 08:24 AM IST
ఫైజర్ కరోనా వ్యాక్సిన్: మూడు వారాల్లో రెండు షాట్లు కావాలి.. పంపీణీ కష్టమే.. ఖర్చు కూడా ఎక్కువే!

Pfizer:ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ప్రజలు ఇంకా కరోనా కొరల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల చూపంతా వ్యాక్సిన్‌‌పైనే ఉంది. టీకా ఎప్పుడు వస్తుందా? అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ప్రతి ఒక్కరు విశ్వాసం వ్యక్తంచేశారు.



టీకా ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చినా.. ఉత్పత్తి నుంచి రవాణా వరకు ఉన్న సవాళ్లన్నీ దాటుకుంటూ ప్రజలకు వ్యాక్సిన్ ఎప్పుడు చేరుతుంది అనేది అంతుబట్టట్లేదు. ఇప్పటికే కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు పూర్తి కాకుండానే పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ డోసులను కొంటున్నాయి. దీంతో అందరికీ వ్యాక్సిన్‌ అందుతుందా? సామాన్యుడికి అందుబాటు ధరల్లో టీకా చేరువవుతుందా? అసలు ఏ ప్రాతిపదికన పంపిణీ చేస్తారనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.



కరోనా వైరస్(COVID-19)ను నివారించడంలో అమెరికన్‌ ఫార్మా కంపెనీ ఫైజర్‌ తయారుచేసిన టీకా 90శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ టీకా మూడు వారాల వ్యవధిలో రెండు షాట్లు వెయ్యవలసి ఉంటుంది. ప్రజలకు తరువాత అదనపు బూస్టర్ షాట్లు కూడా అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫైజర్‌ సంస్థ 50 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ను తయారు చేస్తోండగా.. 2021 నాటికి 1.3 బిలియన్‌ డోస్‌లను తయారు చేయనున్నట్లుగా వెల్లడించింది.



https://10tv.in/behind-pfizers-covid-vaccine-a-husband-wife-dream-team/
అయితే ప్రపంచ జనాభా 780 కోట్లకు పైనే. ఇంతమంది జనాభాకు మూడు వారాల్లో రెండు షాట్లు అందించడం సంక్లిష్టమైన వ్యవహారం. పైగా ఖర్చు కూడా ఎక్కువే. కరోనా ప్రభావంతో చాలా దేశాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. ఇలాంటి తరుణంలో పూర్తిగా సొంత ఖర్చుతో పంపిణీ అంటే కష్టతరమే. ఇంత వ్యయం భరించడం అధికాదాయ దేశాలకు సాధ్యపడినా.. పేద, మధ్యతరగతి దేశాలకు మాత్రం అదనపు భారంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో రెండు షాట్లు అంటే చిన్నచిన్న దేశాల్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.