Ntpc : ఎన్‌టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ - ఎగ్జిక్యూటివ్‌ (పీజీడీఎంఈ) దీనికి సంబంధించి ప్రోగ్రామ్‌ వ్యవధి 15 నెలలు. ఇందులో ఏడాదిపాటు క్లాస్‌ రూం టీచింగ్‌, మూడు నెలలపాటు ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంటాయి.

Ntpc : ఎన్‌టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్

Ntpc

Ntpc : ఎన్‌టీపీసీ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సొసైటీ ఆధ్వర్యంలోని ఎన్‌టీపీసీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వీటికి అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ మెంటార్‌షిప్‌ అందిస్తోంది.

పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌-ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం- ఈఎం) దీనికి సంబంధించి ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులు లేదా తత్సమాన సీజీపీఏతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అర్హులే. క్యాట్‌,గ్జాట్‌,జీమ్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ – ఎగ్జిక్యూటివ్‌ (పీజీడీఎంఈ) దీనికి సంబంధించి ప్రోగ్రామ్‌ వ్యవధి 15 నెలలు. ఇందులో ఏడాదిపాటు క్లాస్‌ రూం టీచింగ్‌, మూడు నెలలపాటు ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంటాయి. రెండు వారాల ఇంటర్నేషనల్‌ ఇమ్మర్షన్‌ ప్రోగ్రామ్‌ కూడా ఉంటుంది.ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కనీసం అయిదేళ్ల అనుభవం ఉన్నవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరికి కూడా క్యాట్‌, గ్జాట్‌, జీమ్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.

పై రెండు ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఒకేవిధమైన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ముందుగా అకడమిక్‌ ప్రతిభ, జాతీయ పరీక్ష స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి పర్సనల్‌ అసె్‌సమెంట్‌ నిర్వహిస్తారు. అనుభవం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని అర్హులను ఎంపిక చేస్తారు.

ఫీజుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే జనరల్‌ అభ్యర్థులకు రూ.1500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750గా నిర్ణయించారు. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 10, పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:nsb.ac.in సంప్రదించగలరు.