Jntuk : జెఎన్టియు కాకినాడలో పీహెచ్ డీ ప్రోగ్రామ్

స్పెషలైజేషన్‌లకు సంబంధించి సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ లు ఉన్నాయి.

Jntuk : జెఎన్టియు కాకినాడలో పీహెచ్ డీ ప్రోగ్రామ్

Jntu

Jntuk : కాకినాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఏఐసీటీఈ డాక్టోరల్‌ ఫెలోషిప్‌  స్కీం కింద ఈ ఫుల్‌ టైం ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తున్నారు. ఈ స్కీం వ్యవధి మూడేళ్లు. నిబంధనల మేరకు మరో ఏడాది పొడిగించే వీలుంది. మొత్తం 8 సీట్లు ఉన్నాయి.

స్పెషలైజేషన్‌లకు సంబంధించి సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ లు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో డిగ్రీ, పీజీ పూర్తిచేసి ఉండాలి. ఈ రెండు స్థాయుల్లో కనీసం 70 శాతం మార్కులు తప్పనిసరి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 65 శాతం మార్కులు చాలు. నెట్‌/ గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి. టీఈక్యూఐపీ స్కీం కింద ఫ్యాకల్టీగా పనిచేస్తున్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

పీహెచ్‌డీలో ప్రవేశం పొందేనాటికి అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు. ఫెలోషిప్ కు సంబంధించి మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000; చివరి ఏడాది నెలకు రూ.35,000 ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.15000 చెల్లిస్తారు. అభ్యర్థులు వారానికి ఎనిమిది గంటలపాటు టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 20గా నిర్ణయించారు. పూర్తివివరాలకు వెబ్ సైట్ ; www.jntuk.edu.in