India Exports Missiles: చారిత్రాత్మక ఘట్టంలో భారత్ నుంచి క్షిపణుల ఎగుమతి

చారిత్రాత్మక ఘట్టంలో ఫిలిప్పీన్స్ దేశానికి "బ్రహ్మోస్" క్షిపణులను ఎగుమతి చేసేందుకు ఇరు దేశాల మధ్య కీలక ముందడుగు పడింది. ఈమేరకు ఇరుదేశాల మధ్య $55.5 మిలియన్ డాలర్ల ఒప్పదం కుదిరింది.

India Exports Missiles: చారిత్రాత్మక ఘట్టంలో భారత్ నుంచి క్షిపణుల ఎగుమతి

Brahmos

India Exports Missiles: రక్షణ పరికరాలు, క్షిపణుల ఎగుమతి దారుగా ఎదగాలన్న భారత చిరకాల లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. చారిత్రాత్మక ఘట్టంలో ఫిలిప్పీన్స్ దేశానికి “బ్రహ్మోస్” క్షిపణులను ఎగుమతి చేసేందుకు ఇరు దేశాల మధ్య కీలక ముందడుగు పడింది. ఈమేరకు గురువారం ఇరుదేశాల మధ్య $55.5 మిలియన్ డాలర్ల(సుమారు రూ.414కోట్లు) మేర ఒప్పదం కుదిరింది. దీంతో భారత్ నుంచి క్షిపణులు దిగుమతి చేసుకునే మొట్టమొదటి విదేశంగా ఫిలిప్పీన్స్ అవతరించింది. “బ్రహ్మోస్” క్షిపణులను భారత్ నుంచి దిగుమతి చేసుకునేందుకు.. గత కొన్ని రోజులుగా ఫిలిప్పీన్స్ దేశం భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది. భారత కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న DRDO, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థలు సంయుక్తంగా ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని అభివృద్ధి చేయగా..మిత్ర దేశాలకు ఎగుమతి చేయాలనీ ప్రణాళికలు రచించారు.

Also read: AP Politics: బీజేపీ ఏంటో జనాలకు అర్ధం అవుతుంది: మంత్రి బొత్స

స్వదేశీ పరిజ్ఞానంతో దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి.. 2.8 నుండి 3 మాక్ వేగంతో 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఇందులోనే ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న మరో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి 7 మాక్ వేగంతో 450-600 కిలోమీటర్ల మధ్యనున్న లక్ష్యాలను ఛేదించగలదు. క్షిపణులను మరింత అభివృద్ధి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనీ భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పలు మిత్ర దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. దక్షిణాసియా దేశాలపై కయ్యానికి దూకుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు, ఫిలిప్పీన్స్ సన్నద్ధమౌతుంది. అందులో భాగంగా తమ నేవీ వ్యవస్థను ఫిలిప్పీన్స్ బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి చేసుకోనున్న బ్రహ్మోస్ క్షిపణులను కూడా ఆ దేశ నేవీకి అప్పగించనుంది ఫిలిప్పీన్స్.

Also Read: Squirrel Attack 18 people: ఉడతే కదాని ఊరుకుంటే 18 మందిని ఆసుపత్రికి పంపింది