AAP గెలుపు.. బేబీ కేజ్రీవాల్ ఫొటోతో ఇంటర్నెట్ మెరుపు

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 06:50 AM IST
AAP గెలుపు.. బేబీ కేజ్రీవాల్ ఫొటోతో ఇంటర్నెట్ మెరుపు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) విజయం సాధించిన తరువాత ఓ చిన్నారి పార్టీ చీఫ్ కేజ్రీవాల్ గెటప్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుడ్డి కేజ్రీవాల్.. బేబీ కేజ్రీవాల్ అంటూ పొగిడేస్తున్నారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత అచ్చం పార్టీ చీఫ్ కేజ్రీవాల్ లాంటి దుస్తులతో మఫ్లర్ కట్టుకుని ఉన్న ఫొటో వైరల్ అయింది. చిన్న మీసకట్టుతో పాటు కేజ్రీవాల్ లాంటి కళ్ళజోడు పెట్టుకున్నాడు. అంతేకాకుండా కేజ్రీవాల్ శీతాకాలపు దుస్తులైన మప్లర్ ను ధరించాడు. చూడటానికి ఆ బుడ్డోడు ‘బేబీ కేజ్రీవాల్’ లా అనిపిస్తున్నాడు.

అంతే ఆ పిల్లవాడి ఫోటోను ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ ఫోటోకి 29 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఆప్ పార్టీ 3వ సారి కూడా విజయం సాధించినందుకు కంగ్రాట్స్ అంటూ ఫోటోను షేర్ చేస్తున్నారు. బేబీ కేజ్రీవాల్ ఫోటో మా హృదయాలను తాకింది అంటూ  నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.